SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Tamil Nadu Tvk Mlas Udhayanidhi Stalin Dgp Complaint 2026

ఇద్దరు TVK ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు.. డీజీపీని ఆశ్రయించిన ఉదయనిధి స్టాలిన్!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 25 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీవీకే ఎమ్మెల్యేలపై ఉదయనిధి ఫైర్..

డీజీపీకి విపక్ష నేత ఫిర్యాదు
డిప్యూటీ స్పీకర్ రవిశంకర్‌పై దాడి ఆరోపణలు
ఎమ్మెల్యే అరుల్ విగ్నేశ్‌ను అరెస్టు చేయాలి
116 రోజుల తర్వాత వేధింపుల కేసు నమోదు
సీఎస్‌ను నిందితుడిగా చేర్చాలని డిమాండ్
రెండు కేసులను సీబీఐకి అప్పగించాలి
నిందితులను సీఎం విజయ్ కాపాడుతున్నారు

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు టీవీకే ఎమ్మెల్యేల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. అధికార పక్షానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఓవైపు ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిని వేధించిన వ్యవహారం, మరోవైపు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన సామాన్యుడిపై డిప్యూటీ స్పీకర్ చేయి చేసుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ రెండు ఘటనలపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిందితులైన ఎమ్మెల్యేలను తక్షణమే అరెస్టు చేయాలని, ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా డీజీపీ కార్యాలయం మెట్లెక్కారు. ఇంతకీ తమిళనాడులో ఏం జరుగుతోంది? ఉదయనిధి స్టాలిన్ చేసిన సంచలన ఆరోపణలేంటి?

తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారాలు ఇరకాటంలో పడేస్తున్నాయి. నవంబర్ 25న చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సి. అరుల్ విగ్నేశ్, ఎం. రవిశంకర్‌లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారికంగా ఫిర్యాదు చేశారు. అసలు వివాదం ఏంటంటే… నవంబర్ 8న తురైయూర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య, చెత్త పేరుకుపోవడంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కార్తీక్ కుమార్ అనే వ్యక్తిపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎం. రవిశంకర్ దాడి చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటన జరిగి 16 రోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఉదయనిధి మండిపడ్డారు. అంతేకాదు, బాధితుడిని బెదిరించి, రాజీ కుదుర్చుకున్నట్లుగా బలవంతంగా వీడియో తీయించారని ఆయన ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్‌తో పాటు, ఆయనకు వత్తాసు పలికిన సమయపురం పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై కూడా కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Join Our Whatsapp Channel

ఇక రెండోది… కళ్లకురిచి టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్ విగ్నేశ్ వ్యవహారం. ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధించారన్న ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. జూలై 31నే ఆ అధికారిణి ఫిర్యాదు చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఉదయనిధి విమర్శించారు. చివరికి మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే, 116 రోజుల ఆలస్యంతో కేసు నమోదు చేశారని ఆయన ఎత్తిచూపారు. ఎమ్మెల్యే అరుల్ విగ్నేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన ఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజీ లాంటి ఎలక్ట్రానిక్ ఆధారాలు ధ్వంసం కాకుండా కాపాడాలని ఉదయనిధి కోరారు.

ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా ఉదయనిధి సంచలన ఆరోపణలు చేశారు. బాధిత మహిళా ఐఏఎస్ అధికారిణికి న్యాయం చేయాల్సింది పోయి, వేరే జిల్లాకు బదిలీ చేయించుకోవాలని సలహా ఇచ్చారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. హోం శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి విజయ్, తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని, ఈ రెండు కేసులను సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఉదయనిధి స్పష్టం చేశారు.

ఇద్దరు టీవీకే ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదాలు తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కళ్లకురిచి ఎమ్మెల్యే అరుల్ విగ్నేశ్‌కు పోలీసులు ఇప్పటికే సమన్లు జారీ చేశారు. మరోవైపు, ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి విజయ్ స్పందిస్తూ, విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మిత్రపక్షాలకు హామీ ఇచ్చారు. అయితే, అటు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. మరి ఉదయనిధి డిమాండ్ చేసినట్లుగా ఈ కేసులు సీబీఐ చేతికి వెళ్తాయా? లేక రాష్ట్ర ప్రభుత్వమే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేది తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

Tags :

  • Arul Vignesh
  • CBI
  • DGP
  • political news
  • Ravi Shankar
  • tamil nadu
  • Tamil Nadu Politics
  • TVK
  • Udhayanidhi Stalin
  • Vijay
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విజయ్‌కు పోటీగా రంగంలోకి ధనుష్..

విజయ్‌కు పోటీగా ధనుష్ పొలిటికల్ స్కెచ్.. 2031 టార్గెట్‌గా భారీ ప్లాన్!

  • విజయ్ కు బిగ్ షాక్..త్రిష కొత్త పార్టీ..!

    త్రిష పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగు?

  • పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత..జనసేన డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల జాబితా విడుదల

    4 డిప్యూటీ మేయర్లు.. 17 వైస్ ఛైర్‌పర్సన్లు! జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

  • అర్ధరాత్రి యలహంక ప్యాలెస్ వద్ద హైడ్రామా.. షర్మిలను అడ్డుకున్న పోలీసులు

    యలహంక ప్యాలెస్ వద్ద హైడ్రామా.. షర్మిలను అడ్డుకున్న పోలీసులు..

  • సీఎం విజయ్ గొప్ప మనసు.. ఎమ్మెల్యే వీఎస్ బాబు పాడె మోసి కన్నీటి వీడ్కోలు

    ఎమ్మెల్యే పాడెను భుజాన మోసిన సీఎం విజయ్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తమిళనాట కార్తీక దీపం చిచ్చు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు!

  • హైదరాబాద్‌కు జల గండం.. చుక్క నీరు దొరకదా?

  • ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. డిసెంబర్ 4నే చివరి రోజు!

  • ఇద్దరు TVK ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు.. డీజీపీని ఆశ్రయించిన ఉదయనిధి స్టాలిన్!

  • నారా లోకేష్ నాయకత్వంలో అతిపెద్ద మైలురాయి – 10 లక్షల మంది మైటీడీపీ సభ్యులు.

  • పూణె కోర్టులో పట్టపగలే కత్తులతో దాడి.. తుపాకీ కాల్పులు! జైలు నుంచి వచ్చి 4 రోజులే..

  • మృత్యువుతో పోరాడి కోలుకుంటున్న రాప్తాడు బాలిక..

Most viewed

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • బతికుండగానే క్రిమేషన్ మెషిన్‌లోకి మహిళ? వైరల్ వీడియో వెనుక షాకింగ్ ఘటన

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

  • హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళ్తున్న దుల్కర్..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam