SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Pune Court Attack Mandar Kivle Firing Maharashtra

పూణె కోర్టులో పట్టపగలే కత్తులతో దాడి.. తుపాకీ కాల్పులు! జైలు నుంచి వచ్చి 4 రోజులే..

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 25 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కత్తులతో నరికి,తుపాకీతో కాల్చి…కోర్టు ఆవరణంలో దారుణం

అది నిత్యం వందలాది మంది న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులతో కిటకిటలాడే అత్యంత కట్టుదిట్టమైన కోర్టు ఆవరణం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అందరూ నమ్మే చోటు.. కానీ, అక్కడ చట్టానికే సవాల్ విసురుతూ పట్టపగలే నెత్తురు ఏరులై పారింది! ఒకవైపు కత్తుల వేట.. మరోవైపు తుపాకీ తూటాల మోత! జైలు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి కేవలం నాలుగు రోజులే అయ్యింది.. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అడుగుపెట్టాడో లేదో, అప్పటికే మృత్యువులా మాటువేసిన ప్రత్యర్థులు అతనిపై విరుచుకుపడ్డారు. చుట్టూ జనం చూస్తుండగానే జరిగిన ఈ భయానక దాడి మహారాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది…

ఇవాళ మధ్యాహ్నం.. మహారాష్ట్రలోని పూణె కోర్టు ఆవరణ వెలుపల అంతా సాధారణంగానే ఉంది. ఒక హత్య కేసులో విచారణకు హాజరయ్యేందుకు ‘మందార్ మారుతి కివ్లే’ అనే వ్యక్తి కోర్టు వద్దకు చేరుకున్నాడు. కానీ, తన కోసం అక్కడ మృత్యువు కాపు కాసి ఉందని అతను ఊహించలేకపోయాడు.
అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు, మందార్ కివ్లేను చూడగానే ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. చేతుల్లో ఉన్న పదునైన కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డారు! క్షణాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. దాడి చేసిన అనంతరం దుండగులు రెండు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. వాటిని చూసిన ప్రతి ఒక్కరి ఒళ్లు గగుర్పొడిచింది. రక్తపు మడుగులో పడి ఉన్న మందార్ కివ్లే, ప్రాణభయంతో లేచి నడిచేందుకు చేసిన ప్రయత్నం, దాడి తీవ్రతకు ఒక చేయి తెగిపోయి ఫుట్‌పాత్‌పై పడి ఉండటం అత్యంత భయానకంగా మారింది. పట్టపగలు, నడిరోడ్డుపై జరుగుతున్న ఈ దారుణాన్ని చూసి చుట్టుపక్కల జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు స్థానికులు ధైర్యం చేసి దుండగులు బైక్‌లపై పారిపోతున్న దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. తీవ్ర గాయాలపాలైన మందార్ కివ్లే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది…

ఇకపోతే మందార్ కివ్లేపై దుండగులు దాడి చేయడానికి..2025 నాటి ఒక సంచలన హత్య కేసుతో లింక్ ఉంది. 2025 ఏప్రిల్‌లో పూణెలోని సంతోష్‌నగర్ కాత్రాజ్ ప్రాంతంలో ‘శుభం సుభాష్ చవాన్’ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భూమి, ఆర్థిక వివాదాల నేపథ్యంలో జరిగిన ఆ హత్య కేసులో ఇప్పుడు దాడికి గురైన మందార్ కివ్లే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మందార్ కివ్లే, కేవలం నాలుగు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచే ప్రత్యర్థులు అతని కదలికలపై నిఘా పెట్టారని, కోర్టు వాయిదాకు కచ్చితంగా వస్తాడని తెలుసుకుని పక్కా పథకం ప్రకారమే ఈ ప్రతీకార దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు ఆవరణ వెలుపల పట్టపగలే కత్తులు, తుపాకులతో దాడి జరగడం మహారాష్ట్రలో శాంతిభద్రతలపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంచలన ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ తీవ్రంగా స్పందించారు. వెంటనే పూణె పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన దుండగులను తక్షణమే పట్టుకోవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం స్థానికులు తీసిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రతీకార జ్వాల మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుందనడానికి పూణె ఘటనే ఒక నిదర్శనం. చట్టం, న్యాయస్థానాల ముందే ఇలాంటి దాడులు జరగడం నిజంగా ఆందోళనకరం.

Join Our Whatsapp Channel

Tags :

  • Breaking News
  • Maharashtra Crime News
  • Maharashtra Police
  • Mandar Kivle
  • Pune Court Attack
  • Pune Court News
  • Pune Crime
  • Pune Firing
  • Telugu crime news
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పార్టీ పేరుతో 22 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్!.. ఢిల్లీలోని కేఫ్‌లో దారుణం

ఢిల్లీలో దారుణం.. 22 ఏళ్ల యువతిపై సహోద్యోగుల సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలు కూడా అరెస్ట్!

  • ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

    ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

  • చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 24 మంది కార్మికులు మృతి..

    ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

  • హైదరాబాద్ లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం.. 10 ఏళ్ల బాలుడు మృతి..

    పిక్నిక్‌కు వెళ్లిన బాలుడికి విషాదాంతం.. ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి!

  • యువకుడి శరీరంలో 4 అడుగుల షవర్ పైపు.. సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు

    యువకుడి కడుపులోకి 4 అడుగుల పైప్..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పూణె కోర్టులో పట్టపగలే కత్తులతో దాడి.. తుపాకీ కాల్పులు! జైలు నుంచి వచ్చి 4 రోజులే..

  • విజయ్‌కు పోటీగా ధనుష్ పొలిటికల్ స్కెచ్.. 2031 టార్గెట్‌గా భారీ ప్లాన్!

  • మృత్యువుతో పోరాడి కోలుకుంటున్న రాప్తాడు బాలిక..

  • ఒడిలో బిడ్డను ఎత్తుకొని పార్లమెంట్‌లో ప్రసంగం..

  • 3 రోజులు ఐటీ ఉద్యోగులకు ఉచిత బస్సులు.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్రయోగం!

  • ఏపీ ప్రజలకు అలర్ట్.. 14 జిల్లాల్లో వర్షాలు! మరో 4 రోజులు వానలే..

  • తెలంగాణలో కొత్త రూల్స్.. ఇంటి నుంచే లైసెన్స్

Most viewed

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • బతికుండగానే క్రిమేషన్ మెషిన్‌లోకి మహిళ? వైరల్ వీడియో వెనుక షాకింగ్ ఘటన

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

  • హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళ్తున్న దుల్కర్..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam