SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Fatima Payman Holds Baby Australia Parliament Speech

ఒడిలో బిడ్డను ఎత్తుకొని పార్లమెంట్‌లో ప్రసంగం..

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 25 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పసిపాపతో పార్లమెంట్ కు..ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అరుదైన దృశ్యం..

ఒక చేతిలో తన ఆరు నెలల పసికందు.. మరోవైపు దేశ భవిష్యత్తును నిర్ణయించే అత్యున్నత చట్టసభ! సాధారణంగా పార్లమెంట్ అంటేనే వాడివేడి చర్చలు, రాజకీయ విమర్శలు, గంభీరమైన వాతావరణం గుర్తొస్తాయి. కానీ, ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఒక అరుదైన దృశ్యం.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కదిలించింది. అది ఒక రాజకీయ ప్రసంగం మాత్రమే కాదు.. మాతృత్వపు మమకారానికి, కర్తవ్య నిష్ఠకు నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు తల్లిగా తన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే, మరోవైపు ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను ఏమాత్రం తగ్గకుండా నిర్వర్తించిన ఒక అద్భుతమైన మహిళ కథ ఇది. ఆవిడే ఆస్ట్రేలియా సెనేటర్ ఫాతిమా పేమన్.

పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమన్. ఆ రోజు ఆస్ట్రేలియా సెనేట్‌లో అత్యంత కీలకమైన ‘ఆన్‌లైన్ భద్రత బిల్లు’ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాబోయే తరాల పిల్లల భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయం అది. అలాంటి సమయంలో.. ఫాతిమా పేమన్ తన ఆరు నెలల ముద్దుల కుమార్తె ‘అలియా’ను చంకలో ఎత్తుకొని సభలోకి అడుగుపెట్టారు. బిడ్డను ఎత్తుకొని మైక్ వద్ద నిలబడి, ఏమాత్రం తడబడకుండా ఆ బిల్లుకు తన మద్దతును నమోదు చేశారు. ఒకవైపు తన ఒడిలో ఉన్న చిన్నారిని లాలిస్తూనే, మరోవైపు ప్రజాప్రతినిధిగా తన గళాన్ని వినిపించారు. ఆమె ముఖంలో ఒక తల్లికి ఉండే సున్నితత్వం, అదే సమయంలో ఒక నాయకురాలికి ఉండాల్సిన దృఢత్వం స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటనలో అందరి మనసులను గెలుచుకున్న మరో అద్భుతమైన దృశ్యం కూడా ఉంది. సభలో ఒకవైపు గంభీరమైన చర్చలు జరుగుతుంటే.. ఫాతిమా వెనుక సీటులో కూర్చున్న మరో సెనేటర్ లిడియా థోర్ప్ ఆ ఆరు నెలల చిన్నారిని నవ్వించడానికి చిన్నపిల్లలా మారిపోయారు. చిన్నారి అలియా ఏడవకుండా, విసుగు చెందకుండా ఉండేందుకు లిడియా థోర్ప్ ఆ చిన్నారిని ఆడిపిస్తు కనిపించారు. రాజకీయ సిద్ధాంతాలు, పార్టీలు వేరైనా.. ఒక పసికందు నవ్వు ముందు, ఒక తల్లి బాధ్యత ముందు అవన్నీ చిన్నవైపోయాయి. ఆ క్షణం పార్లమెంట్ సభ కాస్తా ఒక ఆత్మీయ కుటుంబంలా మారిపోయింది.

ఫాతిమా పేమన్ ఇలా చరిత్ర సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. పదవిలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి పశ్చిమ ఆస్ట్రేలియా సెనేటర్‌గా కూడా ఆమె గతంలోనే రికార్డు నెలకొల్పారు. మన సమాజంలో ఇప్పటికీ చాలామంది మహిళలు ఒక పెద్ద అపోహతో, ఒత్తిడితో బతుకుతుంటారు. పిల్లలు పుట్టాక కెరీర్ ఆగిపోతుందేమో, ఉన్నత పదవుల్లో రాణించలేమేమో అని వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఫాతిమా పేమన్ తన చర్య ద్వారా ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. “మాతృత్వం అనేది ఒక మహిళ ఎదుగుదలకు అడ్డంకి కాదు.. అది ఆమెకు మరింత బలాన్ని ఇచ్చే శక్తి” అని నిరూపించారు. ఇంటి బాధ్యతలను, దేశ బాధ్యతలను ఒకే త్రాసులో సమతూకంతో నడిపించవచ్చని ఆమె చేతల్లో చూపించారు. అందుకే నేడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచం నలుమూలల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అది ఆస్ట్రేలియా పార్లమెంట్ అయినా, ఒక సాధారణ ఆఫీస్ అయినా, లేదా ఒక చిన్న ఇల్లు అయినా.. ఒక తల్లి తన బిడ్డ కోసం, తన కర్తవ్యం కోసం చేసే పోరాటం ఎప్పుడూ గొప్పదే. ఆ రోజు ఫాతిమా పేమన్ తన బిడ్డను ఎత్తుకొని నిలబడిన ఆ దృశ్యం, రేపటి తరం ఆడపిల్లలకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచిపోతుంది.
ఒకవైపు అమ్మగా, మరోవైపు ఎంపీగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన ఫాతిమా పేమన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం.

Join Our Whatsapp Channel

Tags :

  • australia
  • Australian Parliament
  • Fatima Payman
  • Inspirational Story
  • Lydia Thorpe
  • Motherhood
  • senator
  • telugu news
  • viral news
  • Women Empowerment
  • world news
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోలుకుంటున్న రాప్తాడు బాధిత బాలిక..

మృత్యువుతో పోరాడి కోలుకుంటున్న రాప్తాడు బాలిక..

  • ఇవాళ ఏపీలో 14 జిల్లాల్లో వర్షాలు..పిడుగులు పడే ప్రమాదం

    ఏపీ ప్రజలకు అలర్ట్.. 14 జిల్లాల్లో వర్షాలు! మరో 4 రోజులు వానలే..

  • ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

    ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

  • చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 24 మంది కార్మికులు మృతి..

    ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

  • విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు.. లెక్చరర్‌ను చితకబాదిన విద్యార్థులు..

    విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. లెక్చరర్‌కు దేహశుద్ధి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఒడిలో బిడ్డను ఎత్తుకొని పార్లమెంట్‌లో ప్రసంగం..

  • 3 రోజులు ఐటీ ఉద్యోగులకు ఉచిత బస్సులు.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్రయోగం!

  • ఢిల్లీలో దారుణం.. 22 ఏళ్ల యువతిపై సహోద్యోగుల సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలు కూడా అరెస్ట్!

  • తెలంగాణలో కొత్త రూల్స్.. ఇంటి నుంచే లైసెన్స్

  • రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.250కే 3 రకాల సరుకులు!

  • కోటి మందికి ఇందిరమ్మ చీరలు! 26న సీఎం ప్రారంభం

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

Most viewed

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • బతికుండగానే క్రిమేషన్ మెషిన్‌లోకి మహిళ? వైరల్ వీడియో వెనుక షాకింగ్ ఘటన

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam