మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. కాగా ఇవాళ పోలీస్ శాఖపై, ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షనలను అరికట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు అభిప్రాయపడింది.
రోడ్డుపై వెళ్లేటపుడు అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు ఎవరు ఏ ఆపదలో ఉన్నారో అని అంబులెన్స్ వెళ్లేందుకు దారిస్తాము. కానీ కొంత మంది డ్రైవర్లు అవసరం లేకున్నా సైరన్ మోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నగరంలో ఓ అంబులెన్సు డ్రైవర్ బజ్జీల కోసం సైరన్ మోతతో వెళ్లాడు. ఆ తరువాత పోలీసుల ఎంట్రీతో షాక్ అయ్యాడు.
సమాజంలో పోలీసులు అంటే ఎంతో గౌరవం ఉంటుంది.. ప్రజలన శాంతి భద్రతలు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ వారి రక్షణ కోసం అహర్శిశలూ శ్రమిస్తుంటారు.
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ గురించి తెలియని వారు ఉండరు. ఆయన క్రికెట్ మైదానంలో బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టేవి. 1999లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత రాజకీయాల్లో కి వెళ్లారు. కేవలం రాజకీయాల్లోనే కాదు.. వెండితెర, బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయలంతా ప్రస్తుతం ఎంపీ గోరంట్ల మాధవ్ చుట్టూనే నడుస్తోన్నాయి. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై ప్రతి పక్ష టీడీపీ, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతోంది. గోరంట్ల అంశంపై వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్టారెడ్డికి స్పందించారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళ కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు అనిత పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. […]
Acham Naidu: ఏపీలో అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ మరింత పగడ్బంధీగా సిద్ధమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజల్లోకి వాయు వేగంతో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులతో తనకు ప్రాణ హాని ఉందని లేఖలో పేర్కొన్నారు. […]
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ సవాంగ్ కు ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ఉత్తర్వుల్లో తెలిపారు. సవాంగ్ స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు… ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. బెయిల్ పై విడుదలైన బండి… తనకు అవమానం జరిగిందని జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. దీనిపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బండి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ […]
సెల్‌ఫోన్ ప్రస్తుతం అందరినీ కట్టుబానిసలుగా మార్చుతోంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తనపై ఆధారపడేలా మలుచుకుంటోంది. దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారం, అత్యవసర పనుల కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్లను అవసరం లేని పనులకు వినియోగించుకుంటూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కొందరు డ్యూటీల్లో కూడా ఫోన్లను వాడుతూ ప్రమాదాలకు కానీ, తప్పిదాలకు గాని గురవుతున్నారు. ఈ నేపధ్యంలో విధుల్లో ఉన్నప్పుడు […]
కరోనా మహమ్మారి తన తల్లిని బలి తీసుకుంది. కనిపించని లోకాలకు అమ్మ వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోవాలని అనుకుంది ఆ చిన్నారి. అమ్మ ఫోన్ లో ఉన్న ఫొటోలు, వీడియోలను దాచుకోవాలని అనుకుంది. కానీ పాప అనుకున్నది జరగలేదు. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ సమయంలో తన తల్లి వద్ద ఉన్న ఫోన్ తర్వాత మిస్ అయింది. అమ్మకు సంబంధించిన వస్తువులను ఇచ్చారు కానీ ఫోన్ మాత్రం ఇవ్వలేదు కనిపించడం లేదని చెప్పి హాస్పిటల్ సిబ్బంది చేతులు […]