బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గురించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చ చేసేందుకు క్రేజీ బ్యూటీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎంట్రీ ఇవ్వనుందట. ఓ స్కామ్ విషయంలో వివాదాస్పదమైన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఎంట్రీ ఇస్తే షో రక్తి కడుతుందనే అంచనాలున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూ చౌదరి పేరు వినే ఉంటారు. ఇటీవల ఓ భారీ స్కాంలో ఈమె పేరు విన్పించడంతో పాపులర్ అయింది. ఏపీలో 750 కోట్ల భారీ కుంభకోణంలో రీతూ చౌదరి పేరుందనే వార్త రావడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రీతూ చౌదరి మాత్రం తనకు సంబంధం లేదంటోంది. స్కాం తరువాత బెట్టింగ్ యాప్ రచ్చ జరిగింది. మొత్తానికి రీతూ చౌదరి అంటేనే కాంట్రోవర్సీ అనే పేరొచ్చేసింది. ఇలాంటి క్రేజీ బ్యూటీ బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇస్తే రచ్చ మామూలుగా ఉండదంటున్నారు నెటిజన్లు.
రీతూ చౌదరి కేవలం వివాదాలకే కాదు అందచందాలు ఆరబోయడంలో ఆమె తరువాతే ఎవరైనా. ఇప్పటికే తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే పోజులతో రెచ్చగొడుతుంటుంది. ఇప్పుడీమె బిగ్‌బాస్‌లో ఎంటర్ అయితే ఇక ఏ స్థాయిలో అందాలు ప్రదర్శిస్తుందోననే చర్చ మొదలైంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 750 కోట్ల స్కాంలో ఈమె పాత్ర ఉందో లేదో తెలియదు గానీ పుకార్లు మాత్రం భారీగా వచ్చాయి.