మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగుతుంది. ముఖ్యంగా సినీమా ఇండస్ట్రీపై ఏపి ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని చూస్తుందని.. తన పై కోపంతో సినీ ఇండస్ట్రీని ఇబందులకు గురి చేయడం మంచి పద్దతి కాదని.. సినీ పరిశ్రమలోని సమస్యల మీద స్పందించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం సినిమా హాళ్లను మూయించిందని పవన్ అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సుమారు 1100 థియేటర్లలో 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని పేర్ని నాని మండిపడ్డారు. తెలంగాణలో 519 గాను 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ని అడిగే దమ్మూ ధైర్యం పవన్ కళ్యాణ్ కి ఉందా అని ప్రశ్నించారు. సిని పరిశ్రమకు ఏ విధంగా ఇబ్బంది పెట్టామో చెప్పాలని నాని తెలిపారు. సినీ నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తుందని నాని తెలిపారు. ఏపీలో మూడు రోజుల నుంచి 510 థియేటర్స్‌లో లవ్ స్టోరీ సినిమా ఆడుతుందని.. ఏపీలో మొదటి రోజు నిర్మాతకి వచ్చింది 3కోట్ల 81 లక్షలని పేర్కొన్నారు. తెలంగాణ లో 3 కోట్ల రూపాయలు వచ్చాయి. రెండవ రోజు నిర్మాత షేర్.. 2 కోట్ల 67 లక్షలని తెలిపారు. తెలంగాణలో రాష్ట్రంలో 2.40 లక్షలు వచ్చాయని అన్నారు.
ఈ విషయం నిర్మాతలు గ్రహించాలని.. దీనిపై చిత్రనిర్మాత సునీల్ నారంగ్ ఒక్క మాట స్పందించినా చాలు చిత్ర పరిశ్రమకు మేలు చేసినవారవుతారు. నారంగ్ కుటుంబం ఎన్నో ఏళ్లుగా చిత్రసీమలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమను ఏపీలో సీఎం జగన్ ఏం ఇబ్బంది పెట్టారో చెప్పండి అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అసలు విషయం మీరు దృష్టిలో పెట్టుకొని పవన్ వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. జగన్ పై విషం చిమ్మడానికే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని.. దీనిపై నిర్మాత మాట్లాడాలని నాని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ ఇండియా కనుక.. ఏమి మాట్లాడినా చెల్లుతుందంటూ నాని పేర్కొన్నారు.