హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంత ట్రై చేసినా అనుకున్న జాబ్ రావట్లేదనే తీవ్రమైన డిప్రెషన్‌తో ఓ మహిళ ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాప్రా ఏరియాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న గోపాలకృష్ణ తులసీదాస్, స్వాతి మహాజన్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ కపుల్‌కి స్వరూప్ అనే ఆరేళ్ల చిన్న బాబు కూడా ఉన్నాడు. […]
రంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిపై పక్కింటికి వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మంచాల మండలం లోయపల్లి విలేజ్‌లో చోటుచేసుకున్న ఈ ఘోరమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంటి దగ్గర ఆడుకుంటున్న నాలుగేళ్ల ఆ చిన్నారిని టార్గెట్ చేసిన పక్కింటి వ్యక్తి, ఆమెపై ఈ క్రూరమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఆ తర్వాత తీవ్రమైన పెయిన్‌తో బాధపడుతున్న చిన్నారిని గమనించిన పేరెంట్స్, అసలు ఏంజరిగిందని ఆరా తీశారు. దాంతో ఆ చిన్నారి తన […]
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షి ధోనీతో కలిసి నిన్న భాగ్యనగరం హైదరాబాద్‌కు విచ్చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-34లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు ధోనీ దంపతులు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే, ఆయన రాక గురించి ముందే తెలుసుకున్న భారీ సంఖ్యలోని అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఎయిర్‌పోర్ట్ […]
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో వ్యవసాయ రంగ బలోపేతానికి, ఉద్యోగుల సామాజిక భద్రతకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. దాదాపు రూ. 2.79 లక్ష కోట్ల భారీ ప్యాకేజీతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాబోయే […]
వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఆఖరికి ఫైనల్ చేసేసింది. పట్టభద్రుల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరిని బరిలోకి దింపబోతున్నారనే ఉత్కంఠకు తెరదించుతూ హస్తం పార్టీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతాన్ని కవర్ చేసే మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ స్థానంలో తీవ్ర పోటీ నెలకొనగా, అధిష్ఠానం మాత్రం సామ రామ్మోహన్ రెడ్డి వైపే […]
మేడారం సమ్మక్క-సారలమ్మలను ప్యారడైజ్ మూవీ దర్శించుకుంది. అంతేకాదు నేచురల్ స్టార్ నాని వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చారు. హీరో నాని, నటుడు సంపూర్ణేష్ బాబుతో పాటు చిత్ర బృంద సభ్యులు మేడారానికి చేరుకోగా, ఆలయ అధికారులూ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.అనంతరం నాని అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు నానికి, చిత్ర బృందానికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను బహూకరించారు. హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల […]
హైదరాబాద్ ఐటీ హబ్ జూబ్లీహిల్స్‌లో మరోసారి భారీ హనీ ట్రాప్ కలకలం రేపుతోంది! రోడ్ నెంబర్ 36 లోని ఫేమస్ ’36 కెమిస్ట్రీ క్లబ్ అండ్ కిచెన్’ పబ్ వేదికగా అమాయక యువకులను నిలువునా దోచేస్తున్నారు. అందమైన అమ్మాయిలు, డేటింగ్ యాప్‌లు, లగ్జరీ పబ్‌లు.. ఇవే పెట్టుబడిగా సాగుతున్న ఒక భారీ స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది! అవును, మీరు వింటున్నది నిజం. టిండర్, బంబుల్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అపరిచిత అమ్మాయిల నుంచి మీకు మెసేజ్ వచ్చిందా? అయితే […]
కళశాలల్లో ర్యాగింగ్ భూతం మరోసారి పంజా విసిరింది! భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రఖ్యాత విద్యాసంస్థలో, ఎన్నో ఆశలతో కాలేజీకి వెళ్తున్న ఒక అమాయక విద్యార్థిపై సీనియర్లు రాక్షసంగా దాడి చేశారు. ర్యాగింగ్ పేరుతో జరిగిన ఈ అగమ్యగోచర సంఘటన ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం, సీనియర్ల అరాచకానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది… సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్‌లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీలో […]
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై TRS చీఫ్ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వైఫల్యాలను, చేతగానితనాన్ని కేసీఆర్‌పై నెట్టడం ఏంటని ప్రశ్నించారు. గుంటనక్క మైండ్‌గేమ్‌లో పడి పార్టీ అధినేతనే తప్పుబడుతున్నారని మండిపడ్డారు. తనతో పెట్టుకోవద్దని, నిర్దిష్టమైన ఆధారాలతో అన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే.. సమస్యలు తమ వరకు రాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు […]
హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలు వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వీధులు, మండపాలు ఇళ్లల్లో పూజలందుకున్న చిన్న, పెద్ద విగ్రహాలు కలిపి మొత్తం 2.25 లక్షలకు పైగా గణనాథులను నిమజ్జనం చేసినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఒక్క ప్రధాన శోభాయాత్ర రోజునే సుమారు 1.2 లక్షల విగ్రహాలను నిమజ్జనం చేయగా, నగరవ్యాప్తంగా వివిధ మండపాల్లో ప్రతిష్టించిన 20,000కి పైగా భారీ విగ్రహాలు శోభాయాత్ర ద్వారా క్రేన్ల వద్దకు చేరుకున్నాయి. […]
