స్కూల్లో చదువు చెప్పే మాస్టారులు సరిగ్గా చదువు చెప్పకపోయినా, లేక టైమ్ కు రాకపోయినా, మరేదైనా కారణాలతో పిల్లలను వేధించినా పిల్లల తల్లిదండ్రులు టీచర్ ఇంటి ముందు బైటాయించి ధర్నా నిర్వహిస్తారు. కానీ ఓ టీచర్ ఏకంగా విద్యార్థి ఇంటి ముందు బైటాయించి వినూత్నంగా నిరసన తెలియజేయడం మీరు ఎక్కడైనా చూశారా? కానీ సిద్దిపేట జిల్లాలో అదే జరిగింది. ఇంగ్లీష్ చెప్పే ఓ టీచర్ ఏకంగా ఓ విద్యార్థి ఇంటి ముందు బైటాయించి నిరసన తెలియజేశాడు. ఆ టీచర్ ఎందుకు అలా చేశాడు? ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ పాఠశాలలో నవీన్ అనే విద్యార్థి చదువుతున్నాడు. అయితే నవీన్ గతంలో స్కూల్ కు బాగానే వచ్చి చదువుకునేవాడు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., గత 10 రోజుల నుంచి ఆ విద్యార్థి స్కూల్ కు రావడమే పూర్తిగా మానేశాడు. ఇక ఇదే స్కూల్లో ప్రవీణ్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కాగా ఆ టీచర్ నవీన్ హాజరు శాతాన్ని పరిశీలించారు. నవీన్ ఎందుకు స్కూల్ కు రావడం లేదని ఆరా తీశారు. కానీ ఆ టీచర్ కు ఎలాంటి సమాచారం దొరకలేదు. ఇదే విషయాన్ని టీచర్ ప్రవీణ్ ప్రధానోపాధ్యాయుడికి విషయాన్ని చేరవేశారు. అనంతరం అతని ఆదేశాల మేరకు టీచర్ ప్రవీణ్ ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించారు.
ఇక ప్రధానోపాధ్యాయుడి ఆదేశాల మేరకు టీచర్ ప్రవీణ్.. విద్యార్థి నవీన్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో నవీన్ ఉన్నాడని అడిగి అతని కుటుంబ సభ్యులను తెలుసుకున్నారు. ఇక ఆ విద్యార్థి ఇంట్లో ఉండడంతో అతనితో మాట్లాడాడు. స్కూల్ కు ఎందుకు రావడం లేదని అడిగి తెలుసుకున్నారు. నువ్వు ఖచ్చితంగా స్కూల్ రావాల్సిందేనంటూ అతని ఇంటి ముందు బైటాయించి టీచర్ నిరసన తెలిపారు. ఇక ఇదే కాకుండా విద్యార్థికి చదువు పట్ల అవగాహన కల్పించి ఇక నుంచి స్కూల్ కు రావాలంటూ విద్యార్థి నవీన్ కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా ఓ టీచర్ విద్యార్థి ఇంటి ముందు కూర్చుని నిరసన తెలియడంతో స్థానికంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ మాస్టారు తన వృత్తిపట్ల అంకిత భావంతో పని చేయడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనలో టీచర్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.