పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక్కసారిగా చర్చనీయాంశమౌతోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు ప్రభుత్వ వాహనంలో హాజరవడం వివాదాస్పదమై ట్రోలింగ్‌కు దారి తీసింది. అసలేం జరిగింది, నిధి అగర్వాల్ ఏమంటోంది..
టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతోంది. నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఏపీలోని భీమవరంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె ప్రభుత్వ వాహనంలో హాజరైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ తాజా చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కావడంతో ఈ ట్రోలింగ్ రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ వాహనంలో హాజరవడంపై నిధి అగర్వాల్ పాత్ర లేకపోయినా ఆమె ఈ ట్రోలింగ్‌పై స్పందించింది. వివరణ ఇచ్చింది.
ఆ వాహనం ఎరేంజ్ చేసింది ఈవెంట్ ఆర్గనైజర్లే
సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్‌కు సమాధానం ఇస్తున్నానని నిధి అగర్వాల్ తెలిపింది. ఈవెంట్ సందర్భంగా ఆర్గనైజర్లు ఏర్పాటు చేసిన వాహనంలో తానొచ్చానే తప్ప ప్రభుత్వ వాహనం కోసం తాను అడగలేదని తెలిపింది. ఆ వాహనం ఏర్పాటు చేసింది ఈవెంట్ ఆర్గనైజర్లేనని పేర్కొంది. అంతే తప్ప ప్రభుత్వ వాహనం యూజ్ చేయాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పింది. వాస్తవం ఏంటో అందరికీ చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ వివరణ ఇస్తున్నానని వివరించింది.
నిధి అగర్వాల్ చెప్పినట్టు నిజంగానే ఆమె పాత్ర లేకపోవచ్చు. మరి ఓ ప్రభుత్వ వాహనం ఈవెంట్ ఆర్గనైజర్ల చేతికి ఎలా వచ్చిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్ల వద్ద ప్రభుత్వ వాహనం ఉండటంపై సందేహాలు వస్తున్నాయి. ప్రభుత్వం వాహనాలను అద్దెకిచ్చిందా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.