హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పిన ఓ ప్రైవేట్ డయగ్నొస్టిక్స్ కేంద్రం ప్రారంభానికి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్, పుల్లెల గోపీచంద్ వంటి వారు అతిధులుగా హాజరయ్యారు. అయితే.., ఈ వేదికపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవి ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. యన్టీఆర్ తరువాత తెలుగు వారికి దేశ స్థాయిలో గుర్తింపు సంపాదించి పెట్టింది వెంకయ్యనాయుడు అని చిరంజీవి కొనియాడారు. ఇక.. ఇదే సమయంలో వెంకయ్యనాయుడు కూడా చిరుపై ప్రశంసలు కురిపించాడు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చిరంజీవి మూడో కన్ను లాంటి వ్యక్తి. ముందుగా యన్టీఆర్, ఏయన్నార్ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచితే.. వారి తరువాత అంతటి స్థాయి అందుకున్న వ్యక్తి ఒక్క చిరంజీవి మాత్రమే. ఈ విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను. చిరంజీవి రాజకీయాలను వదిలేసి మళ్ళీ సినిమాల్లోకి రావడం ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు తెలియచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.