జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు పాలిటిక్స్ లో, మరోవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే వాహనాన్ని తయారు చేయించుకున్నారు పవన్. అయితే.. పవన్ ప్రచార వాహనం అయినటువంటి వారాహికి తెలంగాణ రవాణాశాఖ పర్మిషన్ ఇచ్చింది. అయితే తాజాగా మరికొన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ కోసం పవన్ కల్యాణ్ ఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. జనసేనకు సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం పవన్ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే వారాహి వాహనాన్ని పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించిన సంగతి తెలిసిందే.
ఏపీలో రాబోయే రోజుల్లో యాత్రకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్.. తన కాన్వాయ్ కి సంబంధించిన వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. వాటికి ఖైరతాబాద్ లోని ఆర్డీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్ తన వాహనాల రిజిస్ట్రేషన్ తో పాటు నెంబర్ ప్లేట్ కు దరఖాస్తు చేశారు. జనసేన వాహనాల రిజిస్ట్రేషన్ కు చేయించేందుకు వెళ్లిన పవన్.. ఆర్డీఏ ఆఫీసర్ ను కలిశారు. మొత్తం 6 జనసేన వాహనాలకు పవన్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక ఆయన రాజకీయ విషయానికి వస్తే.. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తన పంథా మార్చుకున్నారు.
పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. అధికార పార్టీ మీద నిత్యం విమర్శలు గుప్పిస్తున్న జనసేనాని.. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. జనసేన అధికారంలోకి రావడం కంటే, వైసీపీ అధికారం పోగొట్టడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందన్న విషయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల కోసం ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మిలటరీ ట్రక్ ని పోలిన వాహనాన్ని రెడీ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోను, ఫోటోలను సోషల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఆ ఎన్నికల రథానికి ‘వారాహి’ అనే పేరు కూడా పెట్టారు. వాహనం గురించి జనసేనా, వైసీపీ మధ్య మాటల యుద్ధం కూడా ఓ రేంజ్ లో జరిగింది. అయితే.. వారాహి గురించి వచ్చిన వార్తలన్నిటికీ చెక్ పెడుతూ గతంలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరికొన్ని జనసేన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.