ఇటీవల నగరాల్లో ఎక్కడ చూసినా పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. జనాలు వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు చాలా మంది పబ్ లకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూత్ వీక్ పాయింట్ పట్టుకొని పబ్ యజమానులు వెరైటీ ప్రొగ్రామ్స్ అంటూ డబ్బులు గుంజుతున్నారు. ఇటీవల హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ లభ్యమైన విషయం తెలిసిందే.. ఇది తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పలు పబ్ లపై పోలీస్ రైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇక చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ పబ్‌ల నుంచి మాయమైన క్యాబరే డ్యాన్సులు మళ్లీ మొదలయ్యాయి.
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టకీలా పబ్‌లో క్యాబరే డ్యాన్సులు చేస్తూ యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో టకీలా పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నారని తేల్చిన పోలీసులు పబ్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా పలువురురి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తకీల పబ్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.