హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంత ట్రై చేసినా అనుకున్న జాబ్ రావట్లేదనే తీవ్రమైన డిప్రెషన్‌తో ఓ మహిళ ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాప్రా ఏరియాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న గోపాలకృష్ణ తులసీదాస్, స్వాతి మహాజన్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ కపుల్‌కి స్వరూప్ అనే ఆరేళ్ల చిన్న బాబు కూడా ఉన్నాడు. గతంలో యూకేలో సెటిల్ అయిన ఈ ఫ్యామిలీ, జస్ట్ రెండేళ్ల క్రితమే అక్కడి నుంచి హైదరాబాద్‌కి వచ్చి కాప్రాలో రెంట్‌కి ఉంటున్నారు. భర్త గోపాలకృష్ణ ఇక్కడే ఒక జాబ్ చేస్తుండగా, 35 ఏళ్ల స్వాతి మహాజన్ కూడా మంచి ఉద్యోగం సాధించాలని గత కొద్దిరోజులుగా సీరియస్‌గా జాబ్ ప్రయత్నాలు చేస్తోంది.
ఎన్ని రకాలుగా ట్రై చేసినప్పటికీ, ఆమె అనుకున్న ప్రొఫైల్‌లో సరైన జాబ్ రాకపోవడంతో తీవ్రమైన మెంటల్ స్ట్రెస్‌కి గురైంది. జాబ్ రాలేదనే పెయిన్‌తో గత కొన్ని రోజులుగా స్వాతి తీవ్రంగా సఫర్ అవుతోంది. ఈ క్రమంలోనే బుధవారం ఆఫ్టర్‌నూన్ ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. లీవింగ్ హాల్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కి తన చున్నీతో హ్యాంగ్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన హజ్బెండ్ గోపాలకృష్ణ, వైఫ్ సీలింగ్ ఫ్యాన్‌కి హ్యాంగ్ అయి కనిపిండంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఆయన వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫర్మేషన్ అందించారు. స్పాట్‌కి చేరుకున్న కుషాయిగూడ పోలీసులు కేస్ రిజిస్టర్ చేసుకుని ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
