తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగ పలు కీలక నీర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు అంశాలపై అనాలిసిస్ చేసేందుకు, విధి విధానాలను రూపొందించేందుకు ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఫీజుల నియంత్రణ చట్టం, ఇంగ్లిష్ మీడియం అంశాలపై అధ్యయానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సబ్ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ఇందులో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో.. శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించి నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇది చదవండి : మంత్రి కేటీఆర్ కు ధ్యాంక్స్ చెప్పిన ఆనంద్ మహీంద్ర
స్కూల్స్ లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు – మన బడి’ప్రణాళిక కోసం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ సమావేశంలో కొవిడ్ తీవ్రతపైనా చర్చించారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని అన్నారు. అన్ని విధాలుగా కరోనాని ఎదిరించేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.