ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల సంబవిస్తున్న భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల నెపాల్ లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంబవించింది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం భయాందోళన సృష్టించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3 గా నమోదయ్యింది. ఈ భూకం తీవ్ర ప్రభావం భారత్ పై పడింది. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల భూమి కంపించింది. అయితే కొంతవరకు ఆస్తి నష్టం జరిగినా.. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంబవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాల్వంచలో గురువారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంబవించింది. భూ ప్రకంపనలతో చిన్న చిన్న శబ్దాలు వినిపించాయి. భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల గోడలు బీటలు వారాయని. చిన్న శబ్ధాలతో భూ ప్రకంపణలు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నదని.. భయంతో ఇండ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశామని స్థానికులు అంటున్నారు. కొద్ది సేపటి తర్వాత అంతా సర్ధుమణగడంతో ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన అధికారులు భూపంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏమీ జరగలేదని.. భూ ప్రకంపనలు సంబవిస్తే ఇళ్లలో అస్సలు ఉండవొద్దని.. బయటకు రావాలని సూచించారు. పాల్వంచలో సంబవించిన భూకంప తీవ్రత ఎంత మేరకు ఉందన్న విషయంపై పూర్తి సమాచారాం అధికారులు వెల్లలించాల్సి ఉంది. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంప వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.