ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా 2021- 22లో టీమిడియాకి సెకండ్ టెస్టులో భారీ షాక్ తిగిలిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు, ఎందుకు అలా జరిగింది అని చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మరోవైపు సెకెండ్ టెస్టుకు సంబంధించి ఇంకో వ్యక్తి పేరు కూడా బాగా వైరల్ అవుతోంది. అతడే సౌత్ ఆఫ్రికా అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్. అతను భారత మూలాలు ఉన్న వ్యక్తే అని చాలా తక్కువ మందికి తెలుసు. అల్లావుద్దీన్ తండ్రి ఉద్యోగరీత్యా సౌత్ ఆఫ్రికా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయాడు. సెకండ్ టెస్టు మొత్తం అల్లావుద్దీన్ నిర్ణయాలను కామెంటేటర్లు ప్రశంసించారు కూడా. అతను ఎంతో నికచ్చిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు.
South African umpire Allahudien Paleker has roots in Maharashtra, officiated in a Ranji Trophy game before debut;
Check Full 👉 https://t.co/bzEU1roxtm#INDvSA #SouthAfrica #RanjiTrophy pic.twitter.com/3w5V39r3fz
— InsideSport (@InsideSportIND) January 5, 2022
అల్లావుద్దీన్ తండ్రి జమాలుద్దీన్ ది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకాలోని శివ్ గ్రామం. జమాలుద్దీన్ ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికా వలస వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడి పోయారు. అల్లావుద్దీన్ కూడా సౌత్ ఆఫ్రికాలోనే జన్మించాడు. శివ్ గ్రామంలో పాలేకర్లదే ఆధిపత్యం. అల్లావుద్దీన్ తమ గ్రామం పేరును ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు అంటూ శివ్ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Allahudien Paleker, a South African cricket umpire & former cricketer of Maharashtrian descent with roots tracing back to Ratnagiri district in Maharashtra.#SAvIND
— Mohsin Ahmed (@mohsinstats) January 3, 2022
శివ్ గ్రామ సర్పంచ్ దుర్వేశ్ పాలేకర్ మాట్లాడుతూ ‘నేను కూడా పాలేకర్ నే.. అల్లావుద్దీన్ తండ్రి ఇక్కడే పుట్టి పెరిగాడు. ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయాడు. అల్లావుద్దీన్ అక్కడే జన్మించాడు. అతని మూలాలు మా గ్రామంలో ఉన్నాయని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము’ అంటూ దుర్వేశ్ తెలిపాడు. 2014- 15 రంజీ టోర్నమెంట్ లో వాంఖడే స్టేడియంలో ముంబై- మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ కు అల్లావుద్దీన్ అంపైరింగ్ చేశాడు. అంపైర్స్ ఎక్స్ ఛేంజ్ లో భాగంగా అల్లావుద్దీన్ రంజీ మ్యాచ్ కు అంపైరింగ్ చేశాడు.
Allahudien Paleker – Officially introducing Test Umpire 497 and the 57th South African 😁 Messages from his Family, Friends and Umpiring Colleagues ❤ @OfficialCSA @Allahudien @AK_MediaMan #Test #Umpire #497 #SouthAfrica 🇿🇦 #India 🇮🇳 #FreedomSeries #BePartOfIt #SAvIND #Cricket 🏏 pic.twitter.com/JgiCraqeVv
— Suleman Modan (@Figjamfan) January 3, 2022