సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో చాలామంది అగ్రనటులు కన్పిస్తారు. అదే సమయంలో కింగ్ నాగార్జున తొలిసారిగా నెగెటివ్ రోల్ కన్పించడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉందని తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం
రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లోకేష్ కనకరాజ్ తెరెక్కించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా, సన్ పిక్సర్చ్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున, శాండిల్ వుడ్ స్టార్ ఉపేంద్ర కీలకపాత్రల్లో కన్పిస్తారు. ఈ సినిమా వంద బాషా సినిమాలకు సమానంగా ఉంటుందని స్వయంగా రజనీకాంత్ చెప్పడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా నాగార్జున గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. కింగ్ నాగార్జున స్కిన్ టోన్, అందానికి రజనీకాంత్ మైమర్చిపోయారట. ఇప్పుడు ఇదే టాపిక్ హల్‌చల్ చేస్తోంది. అంతకుమించి ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. నాగార్జున నెగెటివ్ రోల్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చాలా ఆసక్తిగా మారింది.
నాగార్జున నెగెటివ్ రోల్ వెనుక కారణం ఇదే
రజనీకాంత్ కూలీ సినిమాలో నాగార్జున పూర్తి నెగెటిల్ రోల్ పోషిస్తారు. దీని వెనుక చాలా ఆసక్తి రేపే కధనం ఉంది. ఈ కారణం కూడా స్వయంగా రజనీకాంత్ వివరించారు. గ్యాంబ్లర్ చిత్రంలో హీరో అజిత్ చెప్పిన డైలాగే దీనికి ప్రేరణ అని రజనీకాంత్ తెలిపారు. ఎంతకాలం మంచివాడిగా నటించేది అంటూ అజిత్ చెప్పిన డైలాగ్ నేపధ్యంలో నాగార్జున విలన్‌గా మారారని రజనీకాంత్ స్పష్టం చేశారు. కమల్ హాసన్ సైతం ఆశ్చర్యపడేలా నాగార్జున ఈ సినిమాలో నటించారని రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు.