టీమ్ ఇండియా ఇప్పుడు ఆసియా కప్ 2025పై కన్నేసింది. యూఏఈ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీకు టీమ్ ఇండియాలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై ఆ దేశంతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసిన ఇండియా ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం సిద్ధమౌతోంది. ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ యూఏఈ వేదికగా జరగనుంది. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ దేశాలు ఉంటే గ్రూప్ బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ దేశాలున్నాయి. ఈ టోర్నీ కోసం టీమ్ ఇండియాలో కీలక మార్పుల జరగవచ్చని తెలుస్తోంది. కొందరు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చు.
ఇటీవల హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్య కుమార్ యాదవ్ ఇంకా ఫిట్‌నెస్ సాధించాల్సి ఉండటంతో ఆసియా కప్‌లో ఆడే అవకాశాలు కన్పించడం లేదు. టాప్ పేసర్ జస్‌ప్రీత్ బూమ్రా కూడా ఆడకపోవచ్చు. యువ ఆటగాళ్లు శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్‌లు కచ్చితంగా ఆడే అవకాశాలున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో స్థిరంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు సంజూ శామ్సన్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్‌లకు చోటు దక్కవచ్చు.
ఆల్ రౌండర్ల స్థానంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉంటే బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు స్థానం లభించవచ్చు.
ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా అంచనా
యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శామ్సన్, ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ సిరాజ్