ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో ఉంటున్న జంట టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్, అతని మాజీ భార్య ధనశ్రీ వర్మ. పెళ్లి బంధానికి చెక్ పెట్టిన ఈ ఇద్దరూ ఇటీవల విడాకులు కూడా తీసుకున్నారు. అయినా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉందట. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నాడు. విడాకుల సమయంలో కూడా ఈ ఇద్దరూ చర్చనీయాంశమయ్యారు. కోర్టుకు వచ్చినప్పుడు యజువేంద్ర చాహల్ ధరించిన టీ షర్ట్ విషయంలో ధనశ్రీ వర్మ రాద్ధాంతం చేసింది. దాంతో ఈ ఇద్దరి మధ్య విబేధాలు తీవ్రస్థాయిలోనే ఉన్నాయనే చర్చ రేగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ ఇద్దరికిద్దరు వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఈ ఇద్దరి గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇవిప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
యజువేంద్ర చాహల్- ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకున్నా ఇంకా ఆ ఇద్దరి మధ్య బంధం కొనసాగుతోందని ఫరా ఖాన్ చెప్పింది. ఇప్పటికీ ఇద్దరూ మెస్సేజ్ ద్వారా చాటింగ్ చేసుకుంటున్నారని పేర్కొంది. ఈ విషయాన్ని ధనశ్రీ వర్మ స్వయంగా తనతో చెప్పిందని ఫరా ఖాన్ తెలిపింది. యజువేంద్ర చాహల్ తనను అమ్మా అంటూ ముద్దుగా పిలిచేవాడని, కానీ ఎందుకు వదిలేశాడో తెలియదని చెప్పేదని ఫరా ఖాన్ చెప్పింది. భార్యాభర్తలుగా ఇద్దరి బంధం ముగిసినా స్నేహబంధం ఇంకా కొనసాగుతోందని తెలిపింది.
ధన శ్రీ వర్మ డ్యాన్సర్ కంటే ముందు ఓ డెంటిస్ట్. మూడేళ్లు ప్రాక్టీస్ చేసి ఆ తరువాత క్లినిక్ కూడా నడిపింది. డ్యాన్స్‌పై ఆసక్తితో ఆ కెరీర్ వదిలిపెట్టింది. డెంటిస్ట్‌గా ఉన్నప్పుడు రణబీర్ కపూర్ వంటి సెలెబ్రిటీలకు చికిత్స కూడా చేసింది.