టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గట్టి షాక్ ఇచ్చాడు. అభిమాన హీరోకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అయితే అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న SSMB29పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. 2027లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అంతా చాలా సీక్రెట్ నడుస్తోంది. ఎప్పుడూ సినిమా రంగంలో ఉండే సాంప్రదాయ విధానాలను దర్శకుడు రాజమౌళి ఫాలో కావడం లేదు. హీరో బర్త్ డే సందర్భంగా ఎలాంటి టీజర్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే ఆలోచన చేయడం లేదు. దాంతో మహేశ్ బాబు అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ట్రెడిషనల్ బర్త్ డే రిలీజ్ పద్ధతులకు స్వస్తి చెప్పడంతో ఈసారి మహేశ్ సినిమాకు సంబంధించిన ఎలాంటి టీజర్లు లేదా పోస్టర్ రావడం లేదు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ భారీ విజయం తరువాత రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా SSMB29ని తీర్దిదిద్దే పనిలో నిమగ్నమయ్యాడు. ఇప్పటి వరకు మూస ధోరణిలో ఉండే మాస్ సినిమాగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో హైప్ వచ్చేలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి మహేశ్ బాబు బర్త్ డే గిఫ్ట్‌గా ఎలాంటి టీజర్లు ప్లాన్ చేయడం లేదు.
మహేశ్ బాబు-రాజమౌళి SSMB29 ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. టెస్ట్ షూట్స్, కాస్ట్యూమ్-మేకప్ ట్రయల్స్, స్టంట్ కొరియోగ్రఫీ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆస్కార్ గ్రహీతలైన టెక్నీషియన్లు, హై ఎండ్ వీఎఫ్ఎక్స్ స్డూడియోలతో సినిమా పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి కానుంది.