ఈ క్రేజీ బ్యూటీని చూస్తే మతి పోతుంది కదూ. సూపర్‌స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటించిందంటే నమ్మలేకున్నారా..కానీ నిజమే. హాట్ ఫోటోలతో కుర్రకారును కవ్విస్తోంది. ఇంతకీ ఈమె ఎవరంటే..
టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ అడ్వెంచరస్ నేపధ్యంలో ఉంటుంది. ఎందుకో తెలియదు గానీ మహేశ్ బాబు హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిగ్‌బాస్ షోలో గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అంతకంటే ముందే కొన్ని సినిమాల్లో చేసింది. చిన్న చిన్న పాత్రల్లో నటించింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు-అనిల్ రావిపూడి సూపర్‌హిట్ సినిమా సరిలేరు నీకెవ్వరులో కూడా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక రెండో అక్కగా నటించి మెప్పించింది. రష్మికకు మరో అక్కగా హరితేజ నటించింది. ఇప్పుడైనా మీకు గురొచ్చిందా ఈమె ఎవరో…
సరిలేరు నీకెవ్వరు సినిమాలో ట్రైన్ ఎపిసోడ్‌లో ఈ భామ కన్పిస్తుంది. ఇప్పుడు హాట్ పోజులిస్తూ అందచందాలు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ భామ పేరు అశ్విని శ్రీ. మహేశ్ బాబు సినిమా క్రేజీ బ్యూటీగా కుర్రకారును ఆకర్షిస్తోంది. ఈ భామ కొన్ని ఫోటోలు మీ కోసం..