అద్భుతమైన కెమేరా ఇతర ఫీచర్లతోబ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అది కూడా మీ బడ్జెట్‌కు అనువుగా కేవలం 10 వేల రూపాయలకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎలా వర్కవుట్ అవుతుంది, ఏ కంపెనీ ఫోన్ వంటి వివరాలు తెలుసుకుందాం.
కళ్లు చెదిరే ఫీచర్లతో అతి తక్కువ బడ్జెట్‌కే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. రెడ్ మి ఇటీవల లాంచ్ చేసిన ఈ ఫోన్ మీకు మీ బడ్జెట్‌కు అనువుగా ఉండటమే కాకుండా మంచి ఫీచర్లు అందిస్తుంది. Redmi Note 14 SE స్మార్ట్‌ఫోన్ 15 వేలకు లాంచ్ కాగా, Redmi Note 14C మాత్రం కేవలం 10 వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర కేవలం 9999 రూపాయలు మాత్రమే. అమెజాన్‌లో అయితే 9498 రూపాయలకే తీసుకోవచ్చు. కొన్ని నిర్దిష్ట బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో వేయి రూపాయులు డిస్కౌంట్ లభించనుంది. అంటే కేవలం 8500 రూపాయలకే ఈ ఫోన్ పొందవచ్చు.
రెడ్‌మి 14సి 5జి స్మార్ట్‌ఫోన్ 6.88 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఐపీ 52 రేటింగ్‌తో యాంటీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ దీని ప్రత్యేకత. ఇక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఎస్ఓసి ప్రోసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ ఓఎస్‌తో ఉంటుంది. రెండేళ్లు ఓఎస్ అప్‌డేట్స్, 4 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉచితంగా లభిస్తాయి. ఇక కెమేరా అయితే ఏకంగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉండి 5160 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది.
అందుబాటులో మూడు వేరియంట్లు
4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 10,498 రూపాయలు కాగా 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 11,498 రూపాయలకు లభిస్తుంది. ఇక 4జీబీ ర్యామ్, 64 జీబీ వెర్షన్ ధర 9498 రూపాయలు. ఈ ఫోన్ స్టార్ లైట్ బ్లూ, స్టార్ డస్ట్ పర్పుల్, స్టార్ గేజ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇన్ని ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కేవలం 9 నుంచి 11 వేల మధ్యలో లభిస్తుందంటే మంచి ఆఫర్ కింద పరిగణించవచ్చు.