మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ముసురు వాతావరణం మరోసారి తప్పేట్టు లేదు. రానున్న వారం రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏయే ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయో తెలుసుకుందాం.
అండమాన్ సముద్రంలో ఏర్పడిన వాయగుండం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మరో రెండు రోజులు అల్పపీడనంగా ఉండి ఆ తరువాత వాయగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో వారం రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. రేపు ఆగస్టు 3 నుంచి వరకు తమిళనాడులో, 6,7 తేదీల్లో కేరళలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల తరువాత మధ్య, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది. రాత్రి వేళ మోస్తరు వర్షం పడవచ్చు. హైదరాబాద్‌లో మాత్రం వాతవరణం పొడిగా ఉండనుంది.
ఇక ఏపీలో రాయలసీమలో మేఘావృతమై మోస్తరు వర్షాలు పడతాయి. కోస్తా, ఉత్తరాంద్రలో ఎండలు దంచి కొట్టినా సాయంత్రం వర్షాలు పడనున్నాయి. చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు, అనంతపురం, ఒంగోలులో రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 5 6, 7 తేదీల్లో మా3త్రం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక పగటి ఉష్ణోగ్రత తెలంగాణలో 32-33 డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో 36-37 డిగ్రీలు నమోదు కావచ్చు.