శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లు గెలిచి జోరుమీదుంది టీమిండియా. ఇదే జోరును న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. కివీస్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. బుధవారం(జనవరి 18) హైదరాబాద్ వేదికగా తొలి వన్డే ప్రారంభం అయ్యింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఇండియన్ ఓపెనర్స్ రోహిత్ శర్మ-శుభ్ మన్ గిల్ లు భారత్ కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 12 ఓవర్లలో 60 పరుగులు జోడించారు. అయితే మంచి టచ్ లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 34 పరుగులు చేసి.. టిక్నర్ బౌలింగ్ లో డార్లీ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు ను రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ.. వరల్డ్ క్రికెట్ లో హిట్ మ్యాన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు దూరం అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం లంకతో వన్డే సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. ఇక శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో కొద్దిలో సెంచరీ మిస్ చేసుకుని.. టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు రోహిత్. తాజాగా న్యూజిలాండ్ తో ప్రారంభం అయిన తొలి మ్యాచ్ లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ అంతలోనే 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో తక్కువ స్కోరుకే అవుట్ అయినప్పటికీ రోహిత్.. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.
Rohit Sharma overtakes MS Dhoni 🏏🫡#CricketTwitter #indvsnz pic.twitter.com/BHFS65FX3t
— Sportskeeda (@Sportskeeda) January 18, 2023
ఈ క్రమంలోనే ఇప్పటి వరకు స్వదేశంలో ఆడిన వన్డేల్లో 123 సిక్స్ లు కొట్టి అగ్రస్థానంలో కొనసాగాడు ధోని. తాజాగా కివీస్ తో జరిగిన మ్యాచ్ లో 2 సిక్స్ లు బాదడం ద్వారా రోహిత్ ఖాతాలో 125 సిక్స్ లు చేరాయి. దాంతో ధోని రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఈ సిక్సర్ల వరుసలో రోహిత్, ధోని తర్వాత 71 సిక్స్ లతో సచిన్ టెండుల్కర్ ఉండగా.. ఆ వెంట కోహ్లీ 66, యువరాజ్ 65 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మెుత్తంగా రోహిత్ శర్మ 238 వన్డే ల్లో 263 సిక్స్ లు బాదాడు. ఇక అటు ధోని సైతం 350 వన్డే మ్యాచ్ ల్లో 229 సిక్స్ లు కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 20 ఓవర్లకే భారత టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5) పరుగులకే పెవిలియన్ కు చేరారు. ప్రస్తుతం ట భారత్ 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజ్ లో శుభ్ మన్ గిల్ (70), సూర్యకుమార్ యాదవ్(21) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
Most sixes in ODI in India:
1) Rohit – 125*
2) Dhoni – 123
3) Yuvraj – 71Hitman domination in six hitting.
— Johns. (@CricCrazyJohns) January 18, 2023