జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇక. అభిమాన హీరోకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ విడుదలైంది. తారక్ రాజకీయాల్లో ఎంట్రీపై అతని సోదరి క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సినిమాల్లో, రాజకీయాల్లో వారసత్వం సాధారణంగా ఉండేదే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ, హరికృష్ణలు అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో వచ్చినా పార్టీ పగ్గాలు మాత్రం అల్లుడు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు పార్టీ తరపున 2009 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసినా ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. కాలక్రమంలో పార్టీకు పూర్తిగా దూరమయ్యారు. రాజకీయ పరిణామాలపై పెద్దగా స్పందించడం కూడా మానేశారు.
ఇటీవల అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెబుతారని బావించినా అది జరగలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకు బుద్ది చెబుతామని జూనియర్ అభిమానులు హెచ్చరించారు. ఈ తరుణంలో తారక్ సోదరి నందమూరి సుహాసిని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి.
నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నందమూరి సుహాసిని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తారక్ రాజకీయాల్లో ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారని, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని ఆమె నిర్ధారించింది. నందమూరి సుహాసిని వ్యాఖ్యలతో తారక్ అభిమానుల్లో జోష్ పెరిగింది.
Nandamuri suhasini garu about tarak anna political entry💥
Nikosam yeduruchusthunnam veera @tarak9999 ❤️😭
— . (@Bhavani_99999) August 29, 2025