జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైన ఈ సినిమా ఓటీటీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదలనేది తెలుసుకుందాం.
యశ్‌రాజ్ ఫిల్మ్ యూనివర్శ్‌లో వచ్చిన సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా వార్ 2 ధియేటర్లలో హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో తారక్, హృతిక్ పోటీ పడి నటించారు. అటు కియారా అద్వానీ అందంతో ఆకట్టుకుంది. కధ పాతదే అయినా తారక్, హృతిక్ నటన, డ్యాన్స్ సినిమా అంచనాలు పెంచాయి. జపాన్‌లో మొదలైన సినిమా కధ ఇటలీ, జర్మనీ, ఇండియా చుట్టూ తిరుగుతుంది. కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ జీవిస్తే క్లైమాక్స్‌లో తారక్ విజృంభించాడు. ఈ నేపధ్యంలో అభిమానులకు పుల్ జోష్ ఇచ్చే మరో అప్‌డేట్ విడుదలైంది.
ఓటీటీ పార్టనర్ ఫిక్స్, ఎప్పుడంటే
వార్ 2 ఇవాళ అంటే ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అప్పుడే ఓటీటీ పార్టనర్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూల్స్ ప్రకారం థియేటర్లలో విడుదలైన 8 వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అంటే అక్టోబర్ రెండోవారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తేదీ ఎప్పుడనేది త్వరలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించనుంది. దసరా సందర్భంగా విడుదల చేయాలనుకుంటే ఓ వారం ముందే రావల్సి ఉంటుంది.