విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా మిస్ అయ్యారా లేక ఇంకోసారి చూసే ఆలోచన ఉందా..అయితే మీకిదే గుడ్ న్యూస్. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ సినిమా మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. సినిమా మొదటి భాగం బాగుందన్పిస్తే రెండో భాగం సాగదీశాడనే ఫిర్యాదులున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన సినిమా కలెక్షన్ల పరంగా ఫరవాలేదన్పించింది. మొదటి రోజు 37 కోట్లు వసూలు చేయగా మొత్తం మీద వంద కోట్లు దాటేసింది. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.
విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణి వసంత, సత్యదేవ్ నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కథ చిన్నప్పుడు కుటుంబానికి దూరమైన అన్నను వెతుక్కుంటూ శ్రీలంక వెళ్లిన హీరో గురించి ఉంటుంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల అంటే ఆగస్టు 27న స్ట్రీమింగ్ కానుంది.