విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా మిస్ అయ్యారా లేక ఇంకోసారి చూసే ఆలోచన ఉందా..అయితే మీకిదే గుడ్ న్యూస్. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ సినిమా మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. సినిమా మొదటి భాగం బాగుందన్పిస్తే రెండో భాగం సాగదీశాడనే ఫిర్యాదులున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన సినిమా కలెక్షన్ల పరంగా ఫరవాలేదన్పించింది. […]