చక్రాల్లాంటి కళ్లతో, అమాయకత్వంగా చూస్తోన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో బడా హీరోయిన్ గా చక్రాన్ని తిప్పుతోంది. ఒకప్పుడు బ్యాడ్ లక్ హీరోయిన్ గా ముద్ర పడ్డ ఈ చిన్నది.. ఇప్పుడు బడా హీరోల పక్కన ఆడిపాడుతోంది. టాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా మారిపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నదాని.. చిన్నప్పటి ఫోటో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..?
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. కర్ణాటకలోని మంగళూరులో జన్మించి ఆమె.. ముంబయిలో పెరిగింది. మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన పూజా.. 2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. 2012లో జీవా నటించిన తమిళ చిత్రం మూగముడి (తెలుగులో మాస్క్) ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. నాగ చైతన్య ’ఓ లైలా కోసం‘ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. అనంతరం వరుణ్ తేజ్ తో కలిసి ముకుందలో మురిపించింది. ఈ సినిమాలన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. తర్వాత హిందీలో హృతిక్ రోషన్ తో మెహంజాదారో లో నటించగా.. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి డిజె తో హిట్ కొట్టిన ఈ సొగసరి.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రంగస్థలంలో ప్రత్యేక సాంగ్ లో రామ్ చరణ్ పక్కన ఆడిపాడి మెప్పించింది. మహర్షి, గద్దల కొండ గణేష్ తో పాటు అలా వైకుంఠపురంతో ఒక్కసారిగా మోస్ట్ డిమాండెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అటు బాలీవుడ్, ఈ టాలీవుడ్, మాలీవుడ్ లను తన గ్లామరస్ తో కట్టిపడేస్తున్న ఫూజా.. చిన్నప్పటి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఎంతో క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ప్యూచర్ లో తాను హీరోయిన్ కాబోతున్నానని ముందే ఊహించిందేమో..కెమెరా ముందు స్టైలిష్ గా నించొని.. కొంటె చూపులు చూస్తోంది ఈ అమ్మడు. మరి పూజా హెగ్డే గురించి, ఆమె సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.