బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే ఎలిమినేషన్ ప్రక్రియలో వచ్చేసింది. ఏకంగా 8 మంది నామినేషన్లలో ఉండగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ఓటింగులో ఎవరు సేఫ్ జోన్, ఎవరు డేంజర్‌లో ఉన్నారో తెలుసుకుందాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై వారం రోజులు కావస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో 15 మంది కంటెస్టెంట్లు ఉండగా అందులో 9 మంది సెలెబ్రిటీలు కాగా మిగిలిన ఆరు మంది సామాన్యులు. సెలెబ్రిటీలో జాబితాలో సంజనా గల్రానీ, ఫ్లోరా షైనీ, భరణి శంకర్, తనూజా, శ్రేష్ఠి వర్మ, రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉంటే సామాన్యుల్లో దమ్ము శ్రీజ, హరిత హరీష్, పవన్ పడాల, డీమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ఉన్నారు. ప్రస్తుతం నామినేషన్లలో 8 మంది ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చర్చనీయాంశమౌతోంది. ఎందుకంటే రోజురోజుకూ ఓటింగ్ లెక్కలు మారుతున్నాయి.
ఇక స్క్రీన్ స్పేస్, ఫుటేజ్ విషయంలో ఎక్కువగా సంజనా గల్రానీ, హరీష్, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, మర్యాద మనీష్ కన్పిస్తున్నారు. మిగిలినవారిలో దమ్ము శ్రీజ తప్ప మరెవరూ అంతగా ఆకట్టుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. శ్రేష్ఠి వర్మ, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీలు అంతగా ఆకర్షించలేకపోతున్నారు. కెప్టెన్‌గా ఎంపికవడంతో సంజనా గల్రానీ నామినేషన్ నుంచి తప్పించుకుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్లలో ఓటింగ్ లెక్కలు మారుతున్నాయి.
ఆ ఇద్దరిలో ఎవరు
ఓటింగ్ విషయంలో సుమన్ శెట్టి, తనూజ టాప్‌లో నిలవడం విశేషం. సుమన్ శెట్టి అంతగా ఆకట్టుకునే ప్రయత్నం చేయకున్నా ఓటింగులో మాత్రం అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, రాము రాథోడ్, రీతా చౌదరి, శ్రేష్ఠి వర్మ, ఫ్లోరా షైని వరుస స్థానాల్లో ఉన్నారు. దాంతో చివరి రెండు స్థానాల్లో ఉన్న శ్రేష్ఠి వర్మ, ఫ్లోరా షైనీల్లో ఒకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం ఖాయం. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ ఎవరనే చర్చ జరుగుతోంది.