డబుల్ లైన్ పనుల కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు, నంద్యాల, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.
మన దేశంలోని కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రధానమైన వాటిల్లో రైల్వేశాఖ ఒకటి. ప్రయాణల కోసం ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించేది రైళ్లనే. సామాన్య ప్రజలు అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర ప్రయాణాల కోసం ఎక్కువగా రైల్వే ఆధారపడతారు. అందుకు తగ్గట్లే భారతీయ రైల్వే వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు తమ సేవల్ని మెరుగుపర్చుకుంటూ వెళ్తోంది. ఇదిలాఉండగా.. ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్ డివిజన్ పరిధిలో రైలు ప్రయాణాలు చేసేవారికి ఓ గమనిక. డబుల్ లైన్ పనుల కారణంగా సికింద్రాబాద్, కర్నూలు, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దయ్యాయి. మరి.. రద్దైన ఆ రైళ్ల వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. గుంతకల్ డివిజిన్ పరిధిలోని బేతంచర్ల-రంగాపురం-మల్కాపురం స్టేషన్‌ల మధ్య డబుల్ లైన్ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల కారణంగా ఆ మార్గాల్లో తిరిగే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ డబుల్ లైన్ పనుల కారణంగా.. నంద్యాల నుంచి డోన్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. అందులోనూ కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే పలు రైళ్లు కూడా ఉన్నాయి. రైళ్లు నం. 07498, 07499 కర్నూలు సిటీ, నంద్యాల మధ్య నడిచే రైళ్లను మార్చి 8 నుంచి 20వ తేదీ వరకు రద్దయ్యాయి. అలానే డోన్, గుంటూరు మధ్య నడిచే రైళ్ల నం.17227, 17228 రైళ్లను మార్చి 8 నుంచి 20వ తేదీ వరకు నంద్యాల వరకు మాత్రమే నడుస్తాయి.
అలానే డోన్ నుంచి గుంటూరు బయలుదేరే రైళ్లు నంద్యాల నుంచి ప్రారంభమవుతుంది. గుంటూరు నుంచి కాచిగూడ వరకు నడిచే 17251, 17252 రైళ్లు..మార్చి 8 నుంచి 20వ తేదీల వరకు కాచిగూడ వరకు వెళ్లదు. ఈ రైళ్లు గుంటూరు నుంచి నంద్యాల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాన సికింద్రాబాద్, గుంటూరు మధ్య నడిచే 17253, 17254 రైళ్లు.. మార్చి 8 నుంచి 20 వరకు.. గుంటూరు వరకు వెళ్ళదు. ఈ రైళ్లు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి డోన్ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఇలా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతల్ డివిజన్ లో పలు రద్దు చేసి, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరి.. సౌత్ సెంట్రల్ రైల్వే ఇచ్చిన ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.