డబుల్ లైన్ పనుల కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు, నంద్యాల, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.
ఆదివారం గుంటూరులో తెలుగు దేశ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకల పేరుతో ఓ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టీడీపీ నేత ఉయ్యూరు శ్రీనివాస్ సంక్రాంతి కానుకల పేరుతో ప్రజలను ఈ సభకు అహ్వానించారు. దీంతో చాలా మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు చాలా మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ సభ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, […]
గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం కావాలనే.. టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లను ధ్వంసం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ఇళ్లు ఎవరూ కూల్చలేదని.. తమకెవరి సానుభూతి అవసరం లేదని ఇప్పటం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు […]
తెలుగు సినిమాలు అనగానే ముందుగా చెప్పుకొవాల్సింది నందమూరి తారక రామారావు గురించి. సోషల్, హిస్టారికల్, కమర్షియల్ ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించి.. మెప్పించారు. మరీ ముఖ్యంగా పలు పౌరాణిక పాత్రలకు తన నటనతో ప్రాణం పోశారు ఎన్టీఆర్. హీరోగా మాత్రమే కాక దర్శకుడిగా, నిర్మాతగా.. రచయితగా సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు. ఆ కాలంలోనే ఆయనకు సొంతంగా సినిమా హాళ్లు కూడా ఉండేవి. వాటిలో ఒకటి.. గుంటూరులోని రామకృష్ణ థియేటర్. ఇక ఈ ఏడాది […]
ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమోన్మాది దాడుల్లో ఇప్పటికీ ఎంతో మంది అమాయక యువతులు బలైన విషయం తెలిసిందే. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియుడు విర్రవీగి ప్రవర్తించాడు. ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె కుటుంబ సభ్యులపై ఊహించని దారుణానికి పాల్పడ్డారు. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమలో విఫలమయ్యానని, తల్లిదండ్రులు మందలించారని.., ఇలా కారణాలు వేరైన అమ్మాయిలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బీటెక్ చదువుతున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నూజివీడు మండలం సూరేపల్లి. ఇదే గ్రామానికి చెందిన యునీలా అనే యువతి ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న ఆ […]
అతని పేరు కర్నాటి సతీష్‌బాబు అలియాస్ సత్యకుమార్. పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన ఇతను అమెరికాలోని వాషింగ్టన్‌లో పనిచేస్తున్నాడు. అగ్రరాజ్యం అమెరికాలో కొలువు అని ఎంతో మంది యువతులను మోసం చేశాడు. పెళ్లి కాలేదని నమ్మించి కోరుకున్న యువతిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేసి ఆ తర్వాత వదిలేసినట్లుగా వార్తలు వినిపించాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం. ఇక చాలా ఏళ్లకు ఇతని లీలలు బయటపడడంతో సతీష్ […]
మానవత్వం మంట కలసి పోతోంది. మనిషి నానాటికీ విచక్షణ కోల్పోతున్నాడు. మృగంలా ప్రవర్తిస్తూ.., రక్త దాహం తీర్చుకుంటున్నాడు. తాజాగా గుంటూరులో ఇలాంటి సంఘటనే జరిగింది. స్వతంత్ర దినోత్సవం నాడే ఓ మృగాడు.., బీటెక్ విద్యార్థిని పట్ట పగలు దారుణంగా హత్య చేశాడు. గుంటూరు రోడ్డులోని కాకాని రోడ్డులో ఈ దారుణం జరిగింది. విద్యార్థినిని ఆ దుండగుడు కత్తితో పలుమార్లు తీవ్రంగా పొడిచాడు.దీంతో.., ఆమె పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు బలంగా దిగాయి. విద్యార్థిని సంఘటనా స్థలంలోనే […]