పవన్ కల్యాణ్ చేసే సాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సాయం చేయడంటూ ఎవరు తలుపుతట్టినా కాదనకుండా ఆదుకుంటారు. అలా నాలుగేళ్ల క్రితం వైజాగ్ లో చిన్నారి రేవతి కుటుంబానికి పవన్ కల్యాణ్ సాయంచేసిన విషయం తెలిసిందే.
రేవతి.. నాలుగేళ్ల క్రితం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఓ నిరుపేద కుటుంబం కలిసింది. తమ చిన్నారి ఆరోగ్యం బాలేదని.. తనకు ఏదైనా సహాయం చేయాలంటూ పవన్ ను అభ్యర్థించారు. చిన్నారి పరిస్థితి చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమెకు ఆర్థిక సాయంతో పాటు ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ చిన్నారిని మైసూర్ లోని ఆశ్రమంలో చేర్పించారు. ఇప్పుడు ఆ చిన్నారి మైసూరు ఆశ్రమంలో తుది శ్వాస విడిచింది. చిన్నారి కోలుకుంటుంది.. సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రుల ఆశలు అడియాసలు అయ్యాయి.
చిన్నారి రేవతికి కండరాల వ్యాధి ఉంది. ఆమె కండరాల్లో పటుత్వంలేక ఇబ్బంది పడేది. రోజురోజుకు ఆమె కండరాలు క్షీణించిపోతాయని తెలిపారు. రోజూ ఫిజియోథెరపీ నిర్వహించకపోతే ఆమె కండరాలు బిగుసుకుపోతాయని గతంలో తల్లిదండ్రులు తెలిపారు. అలా జరగకుండా ఉండాలంటే రోజూ ఫిజియోథెరపీ చేయాలి. అందుకు మైసూరు ఆశ్రమానికి వెళ్లేందుకు పవన్ ఆర్థికసాయం చేశారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతూ ఉండగానే రేవతి తుదిశ్వాస విడిచింది. రేవతికి పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. ఓ చిన్నారి ఇలా బాధపడుతోందని తెలియగానే పవన్ ఆ కుటుంబాన్ని కలిశారు. రేవతిని ఒడిలో కూర్చొబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు.
JanaSena Party Chief @PawanKalyan met Revathi to fulfill her dream & assured financial support to the family
Full Video : https://t.co/nYZjooTuDF pic.twitter.com/8SjFs590cU
— JanaSena Party (@JanaSenaParty) May 19, 2018