సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు నిర్మాత బండ్ల గణేష్. ఒక్కోసారి ఆయన చేసే పోస్ట్‌లు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సార్లు ఆయన చేసే పోస్టుల వల్ల వివాదాల్లో చిక్కుకుంటాడు. కానీ తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూసి నెటిజనులు ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు..
నటుడు, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. నిర్మాతగా మారి.. సూపర్ హిట్ సినిమాలు నిర్మించాడు. ఇక రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కానీ అక్కడ మాత్రం రాణించలేకపోయాడు. ఇక ఇవన్ని పక్కకు పెడితే.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు బండ్ల గణేష్. రాష్ట్రంలో చోటు చేసుకునే సినీ, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు బండ్ల గణేష్. ఇక తాజాగా నందమూరి తారకరత్న మృతి సందర్భంగా చంద్రబాబు, విజయ్‌సాయిరెడ్డిల ఫోటో ట్వీట్ చేస్తూ.. బండ్ల గణేష్ చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ క్రమంలో తాజాగా బండ్ల గణేష్ చేసిన మరో ట్వీట్ వైరలవుతోంది. ఏపీ సీఎం జగన్‌ను సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా కోరాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
అయితే బండ్ల గణేష్ సాయం కోరింది తన కోసం కాదు. ఓ చిన్నారి కోసం. అసలు ఏం జరిగింది అంటే.. కడప జిల్లాకు చెందిన ఓ చిన్నారి.. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అయితే అక్కడ ఫీజులను భరించే స్థోమత తమకు లేదని.. ఎలాగైనా తమను ఆదుకోవాలంటూ చిన్నారి తండ్రి సీఎం జగన్‌ని కోరుకున్నారు. తన కుమార్తెను హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని.. తనకు సాయం చేసి.. తన బిడ్డను బతికించాలని వేడుకున్నాడు. ‘‘జగన్ అన్న నాది కడప. నా బిడ్డకు చాలా సీరియస్‌గా ఉంది. రోజుకు లక్షన్నర అడుగుతున్నారు. నాకు ఆశలన్ని పోయాయి. నా పరిస్థితి బాగా లేదన్న.. ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశాను. ఓ తండ్రిగా నా బాధను అర్థం చేసుకుని.. నా బిడ్డను బతికించండి’’ అని కోరుకున్నాడు. తాను జగన్‌కు అభిమానిని అని.. తన చేయి మీద వేసుకున్న టాటూను కూడా చూపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. బండ్ల గణేష్ దీనిపై స్పందిస్తూ.. ఈ వీడియోని రీట్వీట్ చేయడమే కాక ఏపీ సీఎం జగన్‌తో పాటు సీఎంఓలో పనిచేసే హరికృష్ణ అనే ఉద్యోగిని ట్యాగ్ చేశాడు. అంతేకాక జగన్ అన్నా ఈ పాప జీవితాన్నా కాపాడండి.. ఇది నా రిక్వెస్ట్ అంటూ కోరారు. దీనిపై నెటిజనులు సైతం స్పందిస్తూ.. బాలిక ప్రాణాలు కాపాడలని కోరుతున్నారు. దీన్ని తెలంగాణ మినిస్టర్ కేటీఆర్‌కు ట్యాగ్ చేసి.. సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. బండ్ల గణేష్ చేసిన ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@ysjagan @HariKrishnaCMO Anna please help him save baby life it’s my humble request 🙏🙏🙏 https://t.co/OtktiZZCDd
— BANDLA GANESH. (@ganeshbandla) February 26, 2023