తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా.. అంటూ ప్రజలను మేల్కోలిపి బ్రిటీష్ అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన విప్లవ జ్యోతి.. మన్యం వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంశ్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వేధికపై పలు ఆసక్తికర విషయలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కిషన్ రెడ్డి తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి రోజా లతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. అక్కడ ఉన్న ఆహ్వానితులను చిరంజీవి ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చేతులు పట్టుకొని కొద్దిసేపు మాట్లాడారు ఏపి ముఖ్యమంత్రి జగన్. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే సీఎం జగన్ కి ప్రత్యేక అభిమానం. ఈ విషయం పలు సందర్భాల్లో తెలిపారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిని మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో కలిసిన విషయం తెలిసందే. ఆ మద్య ఏపిలో నెలకొన్ని టిక్కెట్ల వివాదం విషయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శ్రద్ద తీసుకొని సినీ ప్రముఖులతో కలిసి సీఎం జగన్ ని కలిశారు. అంతకు ముందు కూడా సీఎం జగన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లి కలిశారు.
ఇది కూడా చదవండి: Minister Roja: మెగాస్టార్ చిరంజీవితో మంత్రి రోజా సెల్ఫీ!