గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వేడిగా ఉన్న నగరం.. మధ్యాహ్నం నుంచి చల్లబడింది.
గురువారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా నల్లని మేఘాలు ఆకాశానంతటి కమ్మేశాయి. దీంతో నగరమంతా పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, మాదాపూర్,నాగోల్, జూబ్లీహిల్స్ తదితరప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా మధ్యాహ్నం సమయంలో నల్లటి మేఘాల కమ్ముకొచ్చి.. వాన కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. అలానే వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. ఈ వడగళ్లతో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు.
గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఊరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలో మధ్యాహ్నం సమయంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా ఆకాశాన్ని కమ్మేశాయి. దీంతో మిట్ట మధ్యాహ్నమే నగరమంతా చీకట్లు ఏర్పడ్డాయి. అలానే గురువారం నిజామాబాద్, కరీనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలానే మరికొన్ని ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కూడా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.