ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు వీడే పరిస్థితి కన్పించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 5-6 రోజులు భారీ వర్షాలు తప్పవని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా తీరంలో తీరం దాటింది. రానున్న 12 గంటల్లో ఇది కాస్తా బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చు. మరోవైపు రుతు పవన ద్రోణి సూరత్, డయ్యూ […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది. ఫలితంగా ఏపీ తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తీరం దాటనుంది. ఫలితంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ కొమురం భీమ్ ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, మంచిర్యాల, భూపాలపల్లి, […]
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. మరోవైపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులిచ్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి ఆ తరువాత వాయుగుండంగా మారనుంది. ఈ నేపధ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, […]
హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ మద్యాహ్నం నుంచి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని హెచ్చరిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలంటోంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ్టి వాతావరణం గురించి తెలుసుకుందాం. గత 3-4 రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం నుంచి కుండపోత వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో […]
కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తెలుగురాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. నాలుగు రోజుల నుండి పడుతున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఇప్పటికే లోతట్టు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాజెక్టుల వద్దకు వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తివేస్తున్నారు.
తెలంగాణలో మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి.. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపైకి రావాలంటేనే భయంతో వణికిపోయారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. తెలంగాణకు రుతుపవనాలు తాకాయి. దీంతో వర్షాలు పడటం మొదలయ్యాయి.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజు క్రితం పడిన భారీ వర్షం రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఆ దెబ్బనుంచి కోలుకోక ముందే మరో పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది.
ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండలు మండిపోతున్నాయి.. సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వడగండ్ల వానలు కురియడంతో పంటనష్టం ఏర్పడి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండలు మండి పోతున్నాయి. ఉక్కపోత, వేడి గాలులతో జనాలు అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కురుస్తోన్న భారీ వర్షాలకు వాతావరణం చల్లబడింది.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఆ వర్షాల నుంచి రైతులు కోలుకోక ముందే.. మరో భారీ వర్షం రానున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.