ఆస్తులు, డబ్బులకు మనుషుల మధ్య ఉండే సంబంధాలను పెంచగలవు, తుంచగలవు. అలానే ఆస్తుల కోసం సొంత బంధువులే మోసం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆస్తులు తమ పేరున రాయించుకునే వరకు ప్రేమగా చూసుకుని, ఆ తరువాత బయటకి గెంటేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.
ఆస్తులు, డబ్బులకు మనుషుల మధ్య ఉండే సంబంధాలను పెంచగలవు, తుంచగలవు. అలానే ఆస్తుల కోసం సొంత బంధువులే మోసం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆస్తులు తమ పేరున రాయించుకునే వరకు ప్రేమగా చూసుకుని, ఆ తరువాత బయటకి గెంటేస్తున్నారు. తాజాగా ముగ్గురు బావమరదులు.. వృద్ధుడైన బావ ఆస్తిని కాజేసి అనాథగా మార్చారు. ఈ మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన చందు నర్సమ్మ, వెంకటయ్య దంపతులకు రాజమ్మ అనే కుమార్తె ఉంది. అలానే ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజమ్మను అదే గ్రామానికి చెందిన చిన్నాల కొమరయ్య(85)కు ఇచ్చి.. సుమారు 72 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. కొమరయ్య అప్పట్లో అత్తగారింటికి ఇల్లరికం వచ్చాడు. రాజమ్మ తల్లిదండ్రులు.. బిడ్డల నలుగురికి వ్యవసాయ భూమిని సమానంగా పంచి ఇచ్చారు. ఎవరి భూముల్లో వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం రాజమ్మ మృతి చెందింది.
దీంతో కొమరయ్య తన బావమరుదులైన పెద్ద సాయిలు, కొమరయ్య, పర్వతాలు వద్ద నివాసం ఉంటున్నాడు. బావమరుదుల గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కొమరయ్యకు కంటి చూపు మందగించి అనారోగ్య పాలయ్యాడు. దీంతో ముగ్గురు బావమరుదులు బావను ఒక్కోక్కరు ఒక్కో నెల చొప్పున వంతుల వారీగా పోషించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కొమరయ్యకు చెందిన సుమారు 6 ఎకరాల వ్యవసాయ భూమి, 5 తులాల బంగారం, 50 తులాల వెండి, 60 గజాల ఇంటి స్థలాన్ని బావమరదులు ముగ్గురు పంచుకున్నారు.
అలానే ఆ వృద్ధుడిని పోషించే విషయంలో ఇటీవల కొన్ని నెలల నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కొమరయ్యను రాయపర్తి శివారులోని అంగడి ప్రాంతంలో వదిలేశారు. కోమరయ్యను మీడియా ప్రతినిధులు పలకరించగా.. తన ఆవేదనను వ్యక్తం చేశాడు. బావమరుదులు తన ఆస్తులను పంచుకొని అనాథను చేశారని వాపోయాడు. తనకు రోజూ ముద్ద అన్నం పెట్టి చూసుకుంటే చాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన పరిస్థితి చూసిన స్థానికుల హృదయాలు ద్రవించాయి. మరి.. ఆస్తుల కోసం అయినా వారే ఇలా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.