ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాంతోళనకు గురి అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే సమయంలో అదుపు తప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.
దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు కారణం అని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా చేస్తున్నారు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టినా మందుబాబుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా మందుబాబులకు తెలంగాణ సర్కార్ దిమ్మతిరగే షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కాలంలో ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు పెట్టినా.. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు పట్టించుకోవడం లేదు. జరిమానాలు, జైలు శిక్ష వేస్తామన్నా మార్పు రావడం లేదు సరికదా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపై వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక అమాయకుల ప్రాణాలు సైతం తీస్తున్నవారికి తగిన బుద్ది చేప్పేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మందుబాబులను అదుపులో ఉంచాలనే ఉద్దేశంతో.. వారికి బ్రేకులు వేసేందుకు కొత్త రూల్ తీసుకువస్తున్నారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు.
ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానా, కనిష్టంగా జైలు శిక్ష విధిస్తుండేవారు.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడితే నేరుగా చర్లపల్లి జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వేనుక మరో కారణం కూడా ఉంది.. అక్కడ పారిశ్రామిక యూనిట్ ఉంది. తనిఖీలో పట్టుబడ్డ వారితో జైలు లో పనిచేయిస్తే వారిలో కొంతవరకైనా మార్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఇకముందు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకొసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.