త్వరలో తెలంగాణ లో ఎన్నికల రాబోతున్నాయి.. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతలు పలు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
నేడు దేశ వ్యాప్తంగా 77వ స్వతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులకు శుభవార్త తెలిపింది. వారికి లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీ ద్వారా రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. పారిశుద్ద్య కార్మికులు చనిపోతే.. వారి అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచుతున్నట్లు తెలిపింది. వివరాల్లోకి వెళితే..
పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి వారికి లైఫ్ ఇన్స్‌రెన్స్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాని కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేల సర్వీస్ లో ఉండగా చనిపోతే.. వారి అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికుల బీమా పాలసీ మొత్తాన్ని సంబంధింత గ్రామ పంచాయితీ చెల్లిస్తుందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్కీమ్ అమలు అయ్యేలా జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వీరికి ఎంత మొత్తంలో చెల్లించాలనే దానిపై త్వరలో క్లారిటీ ఇస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. గత నెల రోజులుగా పంచాయతీ కార్మికులు ఆందోళన చేస్తూ తాజాగా విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త తెలిపింది. సర్వీస్ లో ఉన్న సమయంలో పంచాయతీ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ భీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభవార్త కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు భీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.