కొత్తగా పెళ్లైన వారికి, రేషన్ కార్డ్ లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ తేదీ నుంచే దరఖాస్తుల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం వినూత్నపథకాలను ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. కాగా టీఎస్ సర్కార్ తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తోన్న రాష్ట్ర ప్రజలకు ఆ తేదీ నుంచి దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇక ఈ నిర్ణయంతో రేషన్ కార్డ్ లేనివారికి ఊరట లభించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ప్రభుత్వం అందించే రేషన్ సరుకులను తీసుకోవాలన్నా రేషన్ కార్డ్ తప్పనిసరి. ఈ కారణంగా రేషన్ కార్డ్ లేని వారు ప్రభుత్వం అందించే పథకాలను పొందలేకపోతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని వారికి లబ్ధి చేకూరేలా కొత్త రేషన్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 21 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. అలాగే పాత రేషన్ కార్డులో తప్పొప్పులు ఉన్నా వాటిని సరిచేసుకోవాలని సూచించింది. ఆధార్ కార్డు, ఫొటో, ఆదాయ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ వంటి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.