కొత్తగా పెళ్లైన వారికి, రేషన్ కార్డ్ లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ తేదీ నుంచే దరఖాస్తుల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు. అర్హులైన పేదలందరికి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3.09 లక్షల మంది లబ్ధిదారులను కొత్తగా గుర్తించారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా […]