తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా అమలు పరుస్తుంది. అందులో భాగంగా రైతుబంధు, రైతుబీమా కూడా ఉన్నవి. రైతులకు సంబంధించి తెలంగాణ సర్కార్ శుభవార్త తెలియజేసింది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని అమలు పరుస్తూ అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుస్తున్నారు. పేదలకు ఇళ్లు పథకంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, తెలంగాణ రైతు బీమా, తెలంగాణ ఆరోగ్య లక్ష్మి, తెలంగాణ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఆసరా పింఛన్లు మొదలైనవి చాలా అమలు పరుస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు రుణాలకు మాఫీ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
రైతుల రుణాలను తీరుస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. సోమవారం 99 వేల 999 రూపాయల వరకు అనగా లక్ష రూపాయల లోపు ఉన్న రుణాను మాఫీ చేయాలని నిర్ణయించారు. బ్యాంకులకు రైతుల తరపున బకాయిలను చెల్లించి రైతులకు రుణ విముక్తి కలిగించారు. దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. రైతుల తరపున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సోమవారం ఒక్కరోజే 10,79,721 మంది రైతుల రూ. 6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సర్కార్ రుణమాఫీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 16.16 లక్షల మంది రైతుల రూ.7,753 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండుగకు ముందు రోజు ఈ గుడ్‌న్యూస్ చెప్పడంతో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.