చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వ్యతిరేకించారు. అలానే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా స్పందన వస్తోంది. కేటీఆర్ ఉద్యమానికి టాలీవుడ్ నుంచి మద్దతు లభించింది. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.. కేటీఆర్ ఉద్యమానికి మద్దతు తెలిపారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ బాటలోనే ప్రధాని మోదీకి ఉత్తరం రాశారు. చేనేత రంగంపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని అశోక్ తేజ డిమాండ్ చేశారు.
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా ఆ రంగానికి చెందిన ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకొంటుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిపై మోయలేని భారం వేస్తున్నదని విమర్శించారు. ఈక్రమంలో చేనేతపై జీఎస్టీని విధించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పోస్టుకార్డు రాసి ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆదివారం ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. అనంతరం దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకునేందుకు ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ మోదీకి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపించాలని ఆయన కోరారు. ఈక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పోస్టు కార్డు ఉద్యమానికి మద్దుతగా ప్రధానికి ఉత్తరం రాశారు. తాజాగా టాలీవుడ్ నుంచి కేటీఆర్ ఉద్యమానికి మద్దతు లభించింది. తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కేటీఆర్ పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపారు. చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీ ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ తానే స్వయంగా రాసి.. ప్రధాని మోదీకీ పోస్టు చేశారు. చేనేత రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృష్టి చేస్తోందని, అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఆయన వివరించారు.
చేనేతలతో స్వయంగా చీరలు తయారు చేయించి.. ప్రభుత్వం బతుకమ్మ పండగ, రంజాన్, ఇతర పండగల సందర్భంగా పంపణీ చేశారని సుద్దాల అశోక్ తేజ గుర్తు చేశారు. చేనేత ఉత్పత్తుల ప్రతి సోమవారం ప్రజాప్రతినిధులు అందరూ ధరించాలని తెలిపిన ఒక్కే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అశోక్ తేజ అన్నారు. చేనేత రంగాన్ని కాపాడేందుకు మంత్రి కేటీఆర్ తలపెట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి ప్రతి మద్దతూ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చేనేత మీద జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి అని ప్రధానికి పోస్ట్ కార్డ్ రాసి విజ్ఞప్తి చేసిన జాతీయ అవార్డు గ్రహీత శ్రీ సుద్దాల అశోక్ తేజ.
మంత్రి @KTRTRS గారు ఇచ్చిన #RollbackHandloomGST పిలుపులో భాగంగా పోస్ట్ కార్డ్ రాశారు సుద్దాల అశోక్ తేజ గారు. pic.twitter.com/xE3h6UybMj
— Konatham Dileep (@KonathamDileep) October 24, 2022