టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా.. మరో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడు మరో వ్యక్తి అరెస్టు అయ్యారు. ఈ ఘటనలో పలు ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎందరో యువత రేయిబవళ్ల కష్టపడి చదువుతుంటే.. డబ్బుల కోసం కొందరు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక టీఎస్పీఎస్సీ ప్రశ్నాప్రతాల లీకేజీ ఘటనలో తవ్వేకొద్దీ ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారానికి అసలు సూత్రధారి నిందుతుల్లో ఒకరైన రేణుకనే అని సమాచారం. పక్క వ్యూహంతో అమ్మాయిల బలహీనత ఉన్న ప్రవీణ్ ను రేణుకు తన దారిలో పెట్టుకుని ఈ లీకేజ్ వ్యవహారం నడిపింది. ఇక ఆమె గురించి అనేక సంచలన వెలుగులోకి వస్తున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేణుక 2011 సమయంలో ఓపెన్ లో టెన్త్ రాసి.. ఆ తరువాత ఇతర కోర్సులు చేసిందంట. 2018లో హిందీ పండిట్ గా ఉద్యోగం పొంది.. వనపర్తి జిల్లా బుద్ధారంలోని గురుకుల పాఠశాలో విధులు నిర్వహిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో రేణుకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చేది. తన వన్ టైమ్ పాస్ వర్డ్ సంబంధించిన విషయంలో మాట్లాడుతూ.. అక్కడే పని చేస్తున్న ప్రవీణ్ తో పరిచయం పెంచుకుంది. అలానే 2017 నుంచి విధుల్లో ఉన్న ప్రవీణ్ టీఎస్పీఎస్ అధికారులు వద్ద మంచి వ్యక్తిగా మెలిగేవాడు.
అయితే అతడికి అమ్మాయిలు బలహీనత ఉందని కొందరి వాదన. ఇక రేణుకకు రాజేశ్వర్ అనే సోదరుడు ఉన్నాడు. టీటీసీ చేసిన అతడికి ఏఈ ఉద్యోగం ఇప్పించాలని రేణుకు భావించింది. ఈక్రమంలోనే తమ్ముడి కోసం ప్రశ్నపత్రాలు సంపాదించేందుకు రేణుక తెరవెనుక పెద్ద తతంగమే నడిపిదంట. ముందుగా ప్రవీణ్ ను కలిసిన రేణుకు తన సోదరుడికి ప్రశ్నపత్రాలు కావాలని కోరింది. అలానే తమ్ముడి కోసం ఆమె సంపాదించిన పత్రాలతో ఇతర అభ్యర్థుల నుంచి రూ. లక్షలు కాజేసేందుకు రేణుక పక్కా వ్యూహం రచించినట్లు దర్యాప్తుతో బయటపడింది.
ప్లాన్ లో భాగంగా మహబాబునగర్ జిల్లాకు చెందిన కొందరు యువకులకి ప్రశ్నపత్రాలు సమాకూరుస్తానంటూ రేణుకు రూ.14 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. రేణుక ఎస్సీ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తూనే 2023 జనవరి నుంచి పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడి.. పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు మొత్తం 16 రోజులు సెలవు పెట్టినట్లు తెలిసింది. జనవరిలో 23, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరిలో 1, 4 నుంచి 8 వరకు, అలానే 24న సెలవు పెట్టింది. ఇటీవలే జరిగిన ఏఈ పరీక్ష రోజు కూడా రేణుక సెలవు తీసుకుంది.
తన బాబుకు ఆరోగ్యం బాగాలేదంటు ప్రిన్సిపల్ కు మెసేజ్ పెట్టింది. అంతేకాక సీవోఈ ప్రవేశ పరీక్షలో ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహించాలని హెచ్ఎమ్ కోరినా.. రేణుక రాలేదు. దీంతో ప్రిన్సిపల్ 10, 11, 12 తేదీలను సెలవుగా మార్కు చేశారు. అయితే మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల ఉండటంతో సెలవులో ఉన్నారని గురుకుల పాఠశాల సిబ్బంది భావించారు. అయితే అదేరోజు సాయంత్రం టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటన బయటపడింది. ఇక దారుణం ఏమిటంటే త్వరలో జరగనున్న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టుల రాతపరీక్షకు కూడా రేణుక ముందుగానే సెలవులు పెట్టడం గమన్హారం.
రేణుకను సస్పెండ్ చేయనున్నట్లు గురుకుల సొసైటీ వర్గాలు వెల్లడించాయి. ఇక మరోవైపు ప్రవీణ్ అమ్మాయిల బలహీనత ఉన్నట్లు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రవీణ్ ఫోన్‌లో 100 మందికి పైగా మహిళల ఫోన్ నంబర్లున్నాయి. 42 మంది మహిళల అర్ధనగ్న, నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్టు సమాచారం. ప్రవీణ్ బలహీనతను అవకాశంగా తీసుకుని రేణుక ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారం నడిపిందని టాక్. అయితే చివరకు బేరసారాలు బెడిసి కొట్టడంతో ప్రవీణ్, రేణుక, ఔటర్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు.
ఈ కేసులో ఇంకా అనేక సంచలన విషయాలు బయటకి వస్తోన్నాయి. ఇలా డబ్బుల కోసం రేణుక.. అమ్మాయిల మోజులో ప్రవీణ్, థ్రిలింగ్ కోసం రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని రేణుకానే పక్క వ్యూహంతో రచించినట్లు తెలుస్తోంది. మరి.. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ ఘటనలో వినిపిస్తోన్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.