టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా.. మరో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడు మరో వ్యక్తి అరెస్టు అయ్యారు. ఈ ఘటనలో పలు ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి.
తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత ఆపార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతీ మంగళవారం.. ఒక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల ఇంటి దగ్గర దీక్షలు చేస్తూ వచ్చిన ఆమె.. ఇవాళ టీఎస్‌పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఎస్పీఎస్సీ ఆఫీసు దగ్గర ధర్నా చేపట్టారు. క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగభృతిని అమలు […]