టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి.
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తవ్వేకొద్దీ ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. కస్టడీకి తీసుకుని తమదైన పద్ధతిలో ప్రశ్నిస్తే లీకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారట. మరోవైపు ఈ కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్ 2017 సంవత్సరంలో టీఎస్‌పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరాడు.
టీఎస్‌పీఎస్సీలో చేరిన తర్వాత నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో ప్రవీణ్ విధులు నిర్వహించాడు. వెరిఫికేషన్ విభాగానికి వచ్చే మహిళల ఫోన్ నంబర్లను ప్రవీణ్ తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ మహిళలతో సాన్నిహిత్యాన్ని బాగా పెంచుకున్నాడు. ఈ క్రమంలో పలువురు మహిళలలో అతడు శారీరక సంబంధమూ పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ మొబైల్లో ఎక్కువగా మహిళల ఫోన్ నంబర్లు, వాట్సాప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ ప్రశ్నాపత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు.
ఇకపోతే, టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న రేణుక అనే యువతి తన అందాన్నే పావుగా వాడుకున్నట్లు సమాచారం. పేపర్ లీక్ చేస్తే, నీ కోసం ఏది కావాలన్నా చేస్తా అంటూ ప్రవీణ్‌కు రేణుక ఆఫర్ ఇచ్చిందట. ఆ మాయలో పడిన ప్రవీణ్.. ఆమె కోసమే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. మొదట యువతి తన తమ్ముడి కోసమే ఇదంతా చేసిందని ప్రవీణ్ చెబుతుంటే.. ఆమె మాత్రం అత్యాశతో మరో అడుగు ముందుకేసి ప్రశ్నా పత్రాన్ని బేరానికి పెట్టింది. క్యాండిడేట్లకు ఒక్కొక్కరికి పేపర్‌ను రూ.14 లక్షలకు బేరానికి పెట్టింది. ఈ మాట ఆనోటా.. ఈనోటా పడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. మరి.. ఈ విషయం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.