హైదరాబాద్ లో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమైయం అయ్యాయి. అయితే మంగళవారం మధ్యాహ్నం మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్ , ఎస్ ఆర్ నగర్, కుకట్ పల్లి, అబిడ్స్, లక్కిడీ కపూల్, కోఠి, సుల్తాన్ బజార్ , అల్వాల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపింది. మరో రెండు గంటల పాటు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సైతం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం కొంతవరకు తెరపిచిన మళ్లీ భారీ వర్షం హైదరాబాద్ ను కుదిపేస్తోంది. మొదట చిరుజల్లులుగా మొదలై.. భారీ వర్షంగా రూపాంతరం చెదింది. మరో రెండు రోజుల పాటు ఇటువంటి వర్షం ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరు భయటకి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.