రాష్ట్రంలో గత కొంత కాలంగా డ్రగ్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఈ మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరించినా పబ్‌ల నిర్వాహకులు వినడం లేదు. నాలుగు రోజుల క్తిరం డ్రగ్స్‌కు బానిసై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. అయినా మార్పు రావడం లేదు.
ఇది కూడా చదవండి: బంజారాహిల్స్‌లో భారీ రేవ్ పార్టీ.. పోలీస్ అదుపులో బిగ్ బాస్ విజేత?
తాజాగా బంజారాహిల్స్ రాడిసన్ హోటల్‌లోని ఫుడింగ్ మింగ్ పబ్‌లో భారీగా డ్రగ్స్‌పట్టుబడ్డాయి. పబ్ మీద దాడి చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక డ్రగ్స్ వినియోగిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు పిల్లలను అరెస్ట్ చేశారు. వీరిలో మాజీ డీజీపీ కుమార్తె, మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లో 6 గ్రాములు కొకైన్‌ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులును చూసి యువతీయువకులు బయటకు పరుగులు తీశారు. ఈ పబ్‌లో డ్రగ్స్ వినియోగం గురించి తరచుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు దాడి చేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.