సినిమా ప్రభావమో, మరేమిటో తెలియదు కానీ పోలీస్ వ్యవస్థపై అపనమ్మకాన్ని పెంచుకున్నారు సామాన్యులు. పోలీసులు కనబడితే.. ఏదో తెలియని భయమైన భావంతో చూస్తుంటారు. కానీ ఏదైనా మనకు అన్యాయం జరితగితే.. ముందు మనల్ని పలకరించి, బాసటగా నిలిచేది రక్షకభటులే.
హైదరాబాద్ లోని ఓ యువతి తన బండి కాన్వాయ్ కి అడ్డుపెట్టి.. ఎస్కార్ట్ పోలీసులపై వాగ్వాదానికి దిగింది. సైరన్ మోగించినందుకు ఆమెకు చిర్రెత్తుకొచ్చి వారి మీద విరుచుకుపడింది. పాయింట్లు మాట్లాడుతూ చెమటలు పట్టించింది. ఇంతకే కాన్వాయ్ చేసిన తప్పేంటి?
సింగర్ సునీత భర్త రామకృష్ణ వీరపనేని బంజారహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపాడు. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఎస్సై 16 మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరో అయ్యారు. 16 మందిని అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్ లో తరలిస్తుండగా డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో డీసీఎం వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అది గమనించిన ఎస్సై కరుణాకర్ రెడ్డి వెంటనే డీసీఎం లోంచి దూకి వారిని రక్షించారు.
ఈ రోజుల్లో ఆడదానికి సమాజంలో రక్షణ లేకుండా పోతోంది. అందమైన అమ్మాయి రోడ్డుపై కనిపిస్తే చాలు.. ఐ లవ్ యు అని చెప్పడం, కాదంటే హత్యలు, ఆపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. చివరికి వారిని హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇకపోతే కొందరు దుర్మార్గులు మాత్రం వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ చిన్నపిల్లలు అని చూడకుండా అత్యాచార దాడులకు కాలు దువ్వుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటన ఇటీవల హైదరాబాద్ […]
హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్‌లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. అనవసరంగా తన పేరు ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
రాష్ట్రంలో గత కొంత కాలంగా డ్రగ్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఈ మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరించినా పబ్‌ల నిర్వాహకులు వినడం లేదు. నాలుగు రోజుల క్తిరం డ్రగ్స్‌కు బానిసై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. అయినా మార్పు రావడం లేదు. ఇది కూడా చదవండి: బంజారాహిల్స్‌లో భారీ రేవ్ పార్టీ.. పోలీస్ అదుపులో బిగ్ బాస్ విజేత? […]
హైదరాబాద్- సమాజంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను, అమ్మాయిలను వేధించే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. అందులోను సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వీరు మరింతగా రెచ్చిపోతున్నారు. వావి వరసలు, వయసు తారతమ్యాలు లేకుండా అందరిని వేధిస్తున్నారు దుర్మార్గులు. తాజాగా హైదరాబాద్ లో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఓ మహిళా టీచర్ ను కొందరు ఆకతాయిలు వేధిస్తున ఘటన వెలుగులోకి వచ్చింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంతో పాటు, టీచర్ గా పనిచేస్తున్న సదరు […]
తాజాగా మెగా డాటర్ నిహారిక భర్తపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అపార్ట్‌మెంటు వాసులపై కూడా నిహారిక భర్త జొన్నల గడ్డ చైతన్య ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇరువర్గాలను సర్ధిచెప్పి కేసు విత్ డ్రా చేసుకునే దిశగా ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిహారక భర్త ఈ కేసుపై జరిగిన విషయాలపై పెదవి విప్పాడు. నేను నా […]
మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి సమయంలో న్యూసెన్స్ క్రియేట్ చేశాడని కాలనీవాసులంతా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం అర్థరాత్రి సమయంలో అపార్ట్‌మెంట్ నుంచి కేకలు, అల్లరు వినిపించటంతో హఠాత్తుగా అందరూ బయటకు వచ్చారు. దీంతో ఏం జరిగిందని అందరూ చైతన్యను అడిగేసరికి వాళ్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో కాలనీవాసులకు, చైతన్యకు మధ్య వివాదం కాస్త తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే వారు బంజారాహిల్స్ పోలీసులను […]